Mahesh Babu: తమిళ అభిమానుల మనస్సు గెలుచుకున్న మహేష్.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చిన సినిమాలకు సంబంధించి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రాయన్ (Raayan) మూవీ కచ్చితంగా చూడాలంటూ మహేష్ బాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రాయన్ సినిమాలో ధనుష్  (Dhanush)  మంచి నటనతో అదరగొట్టాడని మహేష్ బాబు కామెంట్లు చేశారు. రాయన్ సినిమా డైరెక్షన్ అద్భుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఎస్జే సూర్య (S J Suryah) , సందీప్ కిషన్ (Sundeep Kishan), ప్రకాష్ రాజ్ (Prakash Raj)  ఉత్తమంగా నటించారని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. రాయన్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ నూటికి నూరు శాతం న్యాయం చేశారని మహేష్ బాబు వెల్లడించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A R Rahman) సంగీతం మరో అద్భుతం అని సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడించారు. రాయన్ మూవీ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అని చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని మహేష్ బాబు పేర్కొన్నారు.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడం సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాయన్ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మహేష్ బాబు ధనుష్ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను థియేటర్లలో చూస్తామని చెబుతున్నారు.

తమిళ అభిమానులు మరో స్టార్ హీరో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్ బాబును మెచ్చుకున్నారు. మహేష్ ప్రస్తుతం జక్కన్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఆగష్టులో మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి కచ్చితంగా అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మహేష్ బాబు మార్కెట్ అంచనాలకు మించి పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus