‘ఇది ఉగ్రమ్ అనే కన్నడ సినిమాకు రీమేక్’… ‘సలార్’ సినిమా కొబ్బరికాయ కొట్టింది మొదలు వినిపిస్తున్నరూమర్. దీనిపై ప్రశాంత్ నీల్ ఇప్పటికే రెండుసార్లు ఖండించాడు. ‘సలార్’ ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఇదో కొత్త కథ. ప్రభాస్ స్థాయిని పెంచేలా, పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న సినిమా అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా పుకార్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఆ పుకార్లన్నీ సినిమా రీమేక్ విషయంలోనే నడుస్తున్నాయి. తాజగా పుకార్లు పుట్టడానికి కారణం చిత్ర సంగీత దర్శకుడు రవి బ్రసూర్.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ ప్రకటన రాగానే అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. అయితే ‘రీమేక్ ’పుకార్లు కాస్త నిరాశకు గురి చేశాయి. కానీ ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ సూపర్ ఉంటాయిలే. ఆ షాట్స్‌లో ప్రభాస్‌ను చూస్తే వచ్చే కిక్కే వేరు అనుకుంటూ అభిమానులు ఆనందపడుతున్నారు. కానీ ‘రీమేక్’ పుకారు పంటికింది రాయిలా తయారైంది. తాజాగా చిత్ర సంగీత దర్శకుడు రవి బ్రసూర్ ఈ సినిమా గురించి మాట్లాడాడు. ‘సలార్’… ‘ఉగ్రమ్’ చిత్రానికి రీమేక్ అంటున్నారు నిజమేనా అని రవిని అడగ్గ… ‘అది అందరికీ తెలిసిన విషయమే. అయినా ప్రశాంత్ నీల్ ఓ సినిమా ఎలా తీస్తాడో మీ అందరికీ తెలుసు కదా. అది ఏ సినిమా అయితే ఏముంది’ అని అతడు బదులిచ్చాడని వార్తలొస్తున్నాయి.
ఓవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్… రీమేక్ పుకార్లను కొట్టిపారేస్తుంటే, ఇంకోవైపు చిత్రబృందం నుంచి లాంటి లీకులు, సమాచారాలు బయటకు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా సినిమా గురించి పుకార్ల షికార్లు ఆగేలా స్ఫష్టత ఇవ్వాలి. ఇక చిత్రీకరణ విషయానికొస్తే… ఇటీవల గోదావరి ఖనిలో తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
Most Recommended Video
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!