ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ హీరోయిన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా గురించి రోజుకో విషయం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11 న వస్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. అలాగే మరో ఐటెం సాంగ్ ని దాచి ఉంచారు. ఆ పాట సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు నెట్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ పాటలో ఎవరు డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చిత్ర బృందం కొన్ని రోజులుగా అనేకమంది పేర్లను పరిశీలించింది. చివరగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రాని సెలట్ చేసినట్టు తెలిసింది.

ఎన్టీఆర్ గత చిత్రాలైన జనతా గ్యారేజ్.. జై లవకుశ చిత్రాల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కాజల్, తమన్నాలు స్టెప్పులు వేశారు. ఇప్పుడు వారికీ మించిన హీరోయిన్ కావాలని భావించి బాలీవుడ్ కి వెళ్లినట్టు తెలిసింది. రామ్ చరణ్ తుఫాన్ మూవీ ద్వారా  ప్రియాంక తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక ఎన్టీఆర్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే.. మాస్ ప్రజల్లోనూ ప్రియాంక అభిమానులు సంపాదించుకోవడం గ్యారంటీ. పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ లో సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. మెగా బ్రదర్ కె నాగేంద్రబాబు తొలిసారి ఎన్టీఆర్ కి తండ్రిగా నటిస్తున్నారు. జగపతిబాబు విలనిజంతో మరోసారి ఆకట్టుకోనున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతేస్థాయిలో అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus