Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నరేష్ అగస్త్య (Hero)
  • ఫరియా అబ్దుల్లా (Heroine)
  • రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జీవన్ కుమార్, బ్రహ్మానందం, యోగిబాబు, మొట్ట రాజేంద్రన్ తదితరులు (Cast)
  • మురళీ మనోహర్ రెడ్డి (Director)
  • అమర్ బూర - జయకాంత్ - వేణు సద్ది (Producer)
  • కృష్ణ సౌరభ్ (Music)
  • అరుణ్ రాజా (Cinematography)
  • కార్తీక శ్రీనివాస్ (Editor)
  • Release Date : డిసెంబర్ 19, 2025
  • బుర & సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ - ఎం.జె.ఎం మోషన్ పిక్చర్స్ (Banner)

నరేష్ అగస్త్య-ఫరియా జంటగా “సింబా” ఫేమ్ మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “గుర్రం పాపిరెడ్డి”. స్లాప్ స్టిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేసారు. మరి ఈ కామెడీని జనాలు ఎంజాయ్ చేయగలిగారా? లేదా? అనేది చూద్దాం..!!

Gurram Paapi Reddy Review

కథ:

ఇది మల్టీ లేయర్ స్టోరీ, అందువల్ల ఇదీ కథ అని చెప్పాలి. ఇది కదా కథ అనుకుంటున్నా తరుణంలో ట్విస్ట్ వస్తుంది, పోనీలే ఇప్పుడైనా అసలు కథ మొదలైంది అనుకుంటున్నప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చి.. ఆఖరికి ఓహో ఇదా కథా! అనుకునేలా చేస్తుంది. సో, సింపుల్ గా చెప్పాలంటే.. ఓ అయిదుగురు చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుని చేసే తెలివితక్కువ పనుల సమాహారమే “గుర్రం పాపిరెడ్డి” కథాంశం.

నటీనటుల పనితీరు:

నవతరం నటుల్లో మంచి పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్ నరేష్ అగస్త్య. ఈ సినిమాలో గుర్రం పాపిరెడ్డిగా టైటిల్ పాత్రలో కనిపించాడు. అతడి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా క్విక్ రియాక్షన్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ బాగా బ్యాలెన్స్ చేశాడు. అయితే.. కామెడీ టైమింగ్ విషయంలో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ అవసరం.

తెలివితక్కువ తింగరిబుచ్చిలా ఫరియా సరిపోయింది కానీ.. ఆమె డైలాగ్స్ ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఆమె హైద్రాబాదీ యాసను వినియోగించుకునే ఉంటే బాగుండేది.

రాజ్ కుమార్ కసిరెడ్డి ఒక డిఫరెంట్ అప్రోచ్ తో కనిపించాడు. అతడి పాత్ర అక్కడక్కడా నవ్వించింది కానీ.. పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. ఇక వంశీధర్ గౌడ్ వేసే పంచులు ఆల్రెడీ ఎక్కడో వినేశామే అనిపిస్తుంటుంది.

యోగిబాబు, మొట్ట రాజేంద్రన్ లను పనిగట్టుకుని ఈ సినిమాలో ఎందుకు పెట్టినట్లో అర్థం కాలేదు. వాళ్ల వల్ల సినిమాకి యాడ్ అయిన వేల్యూ కూడా ఏమీ లేదు.

సీనియర్ నటులు బ్రహ్మానందం సినిమా మొత్తం ఉన్నారనే భావన కలిగించడం కోసం మధ్యలో ఆయన్ని అప్పుడప్పుడు, అక్కడక్కడా చూపిస్తూ ఉంటారు కానీ.. ఆయన పాత్ర కూడా కథా గమనానికి పెద్దగా పనికిరాలేదు.

ఇక జీవన్ కుమార్ ను కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం అనే భ్రమలో, అతడు సరిగా నటించలేని, ఆడియన్స్ కనెక్ట్ కానీ రిలేట్ కానీ అవ్వలేని పాత్రలో అతడ్ని బలవంతంగా ఇరికించినట్లుగా ఉంది.

సాంకేతికవర్గం పనితీరు:

అరుణ్ రాజా సినిమాటోగ్రఫీ వర్క్, కృష్ణ సౌరభ్ సంగీతం ఈ సినిమాకి టెక్నికల్ గా చెప్పుకునే ప్లస్ పాయింట్స్. సినిమాకి ఒక కొత్త టోన్ ఇవ్వడానికి ఈ ఇద్దరూ బాగా కష్టపడ్డారు.

ఎంత డార్క్ హ్యూమర్ & స్లాప్ స్టిక్ కామెడీ అయినప్పటికీ.. ఇంకాస్త బెటర్ ప్రొడక్షన్ డిజైన్ అవసరం.

దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ఎంచుకున్న కథలో దమ్ము ఉంది, అయితే కథనంలో ఆ పట్టు కనిపించలేదు. కొన్ని డైలాగ్స్ బాగానే పేలాయి. అయితే.. హిలేరియస్ గా వర్కవుట్ అవ్వాల్సిన సీక్వెన్సులు సరిగా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నగల షాపు దొంగతనం సీన్ పేపర్ మీద బాగుండొచ్చు కానీ.. సినిమాలో వర్కవుట్ అవ్వలేదు. కెమెరా, లైటింగ్, మ్యూజిక్ కంటే.. సీన్ ను కన్సీవ్ చేసే విధానం చాలా కీలకం. ఆ విషయంలో దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి కి పరిణితి అవసరం.

విశ్లేషణ:

మనం జోక్ అనుకుని రాసిన డైలాగ్ లేదా సీక్వెన్స్ మొత్తం.. అనుకున్న రీతిలో వర్కవుట్ అయ్యిందా? మనం పేపర్ మీద రాసుకున్న హాస్యం.. ఆన్ స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయ్యిందా? అనేది ప్రతి ఒక్క దర్శకుడు, రచయిత ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సిన విషయం. “గుర్రం పాపిరెడ్డి” దర్శకుడు, రచయిత ఈ విషయంలో తమ ఆలోచనా ధోరణితోపాటు రెగ్యులర్ ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే.. నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డిల నటన, కామెడీ మరియు కొన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

ఫోకస్ పాయింట్: చేసేదేదో ఇంకాస్త చక్కగా చేయాల్సింది పాపిరెడ్డి!

 

రేటింగ్: 2.5/5

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus