2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 సినీ పరిశ్రమని విషాదాలతో ముంచెత్తింది. ఎంతో మంది పేరున్న నటీనటులు,దర్శకులు అలాగే స్టార్స్ కుటుంబానికి చెందిన వారు ఈ ఏడాది మృతి చెందారు. దీంతో చిత్రసీమ కుదేలైపోయింది అనే చెప్పాలి. ఈ క్రమంలో 2025 లో మృతి చెందిన దిగ్గజ నటులు అలాగే దర్శకులు..ఇతర ఫిలింమేకర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Celebrities who passed away in 2025

1) కోట శ్రీనివాసరావు:

టాలీవుడ్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఏడాది అంటే 2025 జూలై 13న మృతి చెందారు. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు కోటా. పాజిటివ్ రోల్ అయినా, నెగిటివ్ రోల్ అయినా, గ్రే షేడ్స్ కలిగిన రోల్ అయినా, భీభత్సమైన విలన్ రోల్ అయినా.. వాటికి జీవం పోసేవారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమని కుదిపేసింది అనే చెప్పాలి. ఆలాగే ఆయన సతీమణి రుక్మిణి సైతం ఆగస్టు 18న మరణించారు.

2) శివ శక్తి దత్తా:

ప్రముఖ స్టార్ లిరిసిస్ట్, అలాగే కథా రచయిత, కీరవాణి తండ్రి అయినటువంటి శివ శక్తి దత్తా కూడా 2025 జూలై 8న మృతి చెందారు. ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలకు కూడా ఆయన రచయితగా పనిచేశారు.

3) ఫిష్ వెంకట్:

ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో కామెడీ విలన్ గా అలరించిన ఫిష్ వెంకట్ సైతం ఈ ఏడాది అంటే 2025 జూలై 18న మృతి చెందారు. అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఫిష్ వెంకట్.. చికిత్సకి తగ్గ డబ్బులు లేక మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

4) ముకుల్ దేవ్:

‘కృష్ణ’ ‘అదుర్స్’ వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ముకుల్ దేవ్ .. ఈ ఏడాది అంటే 2025 మే 23న మరణించారు. ఈయన ప్రముఖ విలన్ రాహుల్ దేవ్ సోదరుడు అనే సంగతి అందరికీ తెలిసిందే.

5) ఏ ఎస్ రవి కుమార్ చౌదరి:

‘యజ్ఞం’ ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరి సైతం ఈ ఏడాది అంటే 2025 జూన్ 10న మృతి చెందారు. అనారోగ్య సమస్యలతోనే ఈయన కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది.

6) అపర్ణ మల్లాది:

‘పాష్ పోరీస్’ అనే వెబ్ సిరీస్ తో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె తర్వాత ‘పెళ్ళికూతురు పార్టీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు.

7) ధర్మేంద్ర:

‘షోలే’ నటుడు, బాలీవుడ్ స్టార్ నటుడు ఐనటువంటి ధర్మేంద్ర సైతం 2025 నవంబర్ 24న అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈయన మృతి ఇండియన్ సినీ పరిశ్రమని కుదిపేసింది అని చెప్పాలి.

8) కిరణ్ కుమార్ అలియాస్ కెకె (KK):

నాగార్జున హీరోగా నటించిన ‘కేడి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కిరణ్ కుమార్… సైతం ఈ ఏడాది 2025 డిసెంబర్ 17న మృతి చెందారు. ఈయన తెరకెక్కించిన ‘KJQ’ అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే మణిరత్నం తెరకెక్కించిన ‘OK బంగారం’ ‘చెలియా’ సినిమాలకి కూడా స్క్రిప్ట్ వర్క్‌లో పనిచేశారు.

9) అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం గారు కూడా 2025 ఆగస్టు 30న మృతి చెందారు.

10) రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ రాజు సైతం 2025 జూలై 15న మృతి చెందారు.

2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus