Star Hero: పారితోషికం విషయంలో ప్రపంచ రికార్డు కొట్టిన స్టార్ హీరో..!

ఒకప్పుడు హీరోలు రూ.10 కోట్లు, రూ.15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు అంటేనే… అదో వింతగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలే అంతంత డిమాండ్ చేస్తుండటంతో అది పెద్ద విషయంగా అనిపించడం లేదు. అయితే స్టార్ హీరోల పారితోషికాలు రూ.100 కోట్లకి టచ్ అవ్వడం మాత్రం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఇండియన్ సినిమాలకి గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలు (Star Hero) సౌత్లోనే ఉండటం మరో విశేషంగా చెప్పుకోవాలి.

Star Hero

రజినీకాంత్ (Rajinikanth) ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సైతం ‘ది రాజాసాబ్’ (The Rajasaab) కోసం రూ.120 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. వీరిద్దరికంటే విజయ్ .. మరింతగా డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.2026 లో జరిగే తమిళనాడు ఎన్నికల టైంకి తన పార్టీని బలోపేతం చేయాలని విజయ్ భావిస్తున్నాడు.

ఈ క్రమంలో కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయడానికి కూడా విజయ్ (Vijay) సన్నాహాలు చేస్తున్నాడు. ఎన్నికల కోసం అతనికి డబ్బులు కూడా అవసరం. అందుకోసం పారితోషికం గట్టిగా డిమాండ్ చేస్తున్నాడట. విజయ్ తొలిసారి వంద కోట్ల పారితోషికం అందుకుంది ‘వరిసు’ (Varisu) చిత్రానికి. ఆ సినిమా కోసం అతను అక్షరాలా రూ.120 కోట్లు పారితోషికం అందుకున్నాడట.

ఇప్పుడు ‘గోట్’ (GOAT) సినిమా కోసం అయితే రూ.160 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్’ హౌస్ లో సినిమా చేయడానికి విజయ్ రెడీ అయ్యాడట. ఆ ప్రాజెక్టు కోసం అక్షరాలా అతను రూ.220 కోట్లు పారితోషికంగా తీసుకోబోతున్నాడట. సౌత్ హీరో (Star Hero) అంత మొత్తం పారితోషికంగా తీసుకోవడం అనేది.. ఓ రకంగా ప్రపంచ రికార్డు అనే చెప్పాలి.

ది రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఎప్పుడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus