Pushpa 2: ‘పుష్ప 2’ టీం.. మళ్ళీ అదే హడావుడి..!

వాస్తవానికి ‘పుష్ప 2’ (Pushpa 2)  చిత్రం ఆగస్టు 15 న విడుదల కావాలి. కానీ సకాలంలో షూటింగ్ పూర్తికాలేనందున డిసెంబర్ 06 కి పోస్ట్ పోన్ చేశారు. నిజానికి ఆగస్టు 15 న సినిమా విడుదల కావడం కష్టమని ముందుగానే వార్తలు వచ్చాయి. అవి సుకుమార్ చెవిన పడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన టీం హుటాహుటిన… ‘200 రోజుల్లో ‘పుష్ప 2′ రిలీజ్’ అంటూ ఓ పోస్టర్ ను వదిలారు.

Pushpa 2

సో ఆగస్టు 15 కి ‘పుష్ప 2’ రిలీజ్ పక్కా అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ‘పుష్ప 2’ రిలీజ్ కాలేదు. కారణం.. అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ కాకపోవడం అనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ‘పుష్ప 2’ టీం యాక్టివ్ అయ్యింది. ‘100 రోజుల్లో ‘పుష్ప 2′ విడుదల’ అంటూ మళ్ళీ పోస్టర్లతో హడావిడి చేస్తుంది. కానీ ఈసారి దాన్ని ఆడియన్స్ అంత ఈజీగా నమ్మడం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా మంది నమ్మడం లేదు.

ఎందుకంటే షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉంది. హీరో, విలన్…ల మధ్య కాంబినేషన్లో కొన్ని సీన్లు షూట్ చేయాలి. మరోపక్క అల్లు అర్జున్  (Allu Arjun)  తన పార్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పెడుతున్నాడు. బ్యాలెన్స్ పార్ట్ అనుకున్న టైంలో కంప్లీట్ అయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయడానికి ఈ టైం సరిపోతుందా? అనేది పెద్ద ప్రశ్న. అందుకే ‘పుష్ప 2’ విడుదలపై ప్రేక్షకులకి నమ్మకం కలగడం లేదు.

తారక్ లక్కీ నంబర్ మ్యాజిక్ రిపీటవుతుందా.. మేకర్స్ అలా చేయనున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus