Vijay Varma: అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు కాగా ప్రస్తుతం తమన్నా వయస్సు 34 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లను సొంతం చేసుకున్నారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించి తమన్నా వార్తల్లో నిలిచారు. తమన్నా (Tamannaah) విజయ్ వర్మ (Vijay Varma) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Vijay Varma

విజయ్ వర్మ తాజాగా తమన్నాతో రిలేషన్ షిప్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ వర్మ మాట్లాడుతూ రిలేషన్ ఏదైనా సరే ఇద్దరు కలిసి సమయాన్ని గడుపుతూ ప్రేమలో ఉన్న సమయంలో ఆ రిలేషన్ ను సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమన్నా ఆలోచనలు, నా ఆలోచనలు ఒకటేనని విజయ్ వర్మ తెలిపారు.

రిలేషన్ షిప్ ను దాచడం సులువైన విషయం కాదని రిలేషన్ షిప్ గురించి దాస్తే ఫోటోలు తీసుకోవాలన్నా బయటకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. ఫీలింగ్స్ ను కంట్రోల్ చేయడం నాకు నచ్చదని మా రిలేషన్ గురించి పబ్లిక్ గా చెప్పినా కొన్ని విషయాలను సీక్రెట్ గానే ఉంచామని విజయ్ వర్మ కామెంట్లు చేయడం జరిగింది.

నా దగ్గర తమన్నా, నేను తీసుకున్న 5000కు పైగా ఫోటోలు ఉన్నాయని ఆ ఫోటోలు మాకు మాత్రమే చెందినవి అని అందువల్లే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పంచుకోవడానికి ఇష్టపడలేదని విజయ్ వర్మ కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరూ ఎదుటోళ్ల రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకుంటారని ఇదో రోగం అయిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

‘పుష్ప 2’ టీం.. మళ్ళీ అదే హడావుడి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus