బాలీవుడ్‌లో రెబల్ హీరోయిన్స్ అంటూ ఓ లిస్ట్ రాస్తే… కచ్చితంగా ఉండే పేర్లలో తాప్సీ పన్ను ఒకటి. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ… మాటలో, చేతలో, సినిమాల ఎంపికలో రెబల్‌గా ఉంటోంది. ఈ క్రమంలో మరో రెబల్ కంగనా రనౌత్‌తో ఢీ అంటే ఢీ అని అంటుంటుంది కూడా. చాలా ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్న భామ… పెళ్లి కాకుండానే బాయ్ ఫ్రెండ్‌తో లివిన్‌లో ఉంది అని అంటుంటారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది అని సమాచారం. ఆ విషయం ఆమెనే అడిగితే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.
తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్చి చివరి వారంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే ‘‘నా పర్సనల్ లైఫ్‌కు సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వను’’ అని తెగేసి చెప్పింది. దీంతో ఆమె పెళ్లి చేసుకుంటోందా లేదా అనేది క్లారిటీ లేకుండా ఉంది. అయితే పెళ్లి పక్కా అని బాలీవుడ్ టాక్.
డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే విషయం తెలిసిందే. ఇటీవలే వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పదేళ్ల నుండి మథియాస్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. దక్షిణాది నుండి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో అతడితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుండి అతడితోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తామిద్దరం సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.
ఇన్నేళ్ల రిలేషన్‌లో ఉన్నారు కాబట్టి… ఇక పెళ్లే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది అయితే ఈమె కూడా కొంతమంది బాలీవుడ్ భామల్లా గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకుంటోందా అనే డౌట్స్ కూడా తీసుకొస్తున్నారు. కానీ నేను ఆ టైప్ కాదు అని ఇప్పటికే తాప్సి (Taapsee) క్లారిటీ ఇచ్చింది. చూద్దాం కొత్త నెలలో ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో.
పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?
‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!