నందమూరి బాలకృష్ణ (Balakrishna) చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini) నిర్మాతగా మారబోతున్నారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్’ షోను అన్నీ తానై సిద్ధం చేయిస్తున్నారు ఆమె. ఇటీవల నిర్మాతగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన ఆమె.. ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఇది కూడా తొలి సినిమాలాగే సహ నిర్మాత / సమర్పకురాలిగానే. తొలి సినిమాను తమ్ముడితో చేస్తుండగా.. రెండో సినిమా తండ్రితో చేస్తుండటం గమనార్హం. నందమూరి బాలయ్య – బోయపాటి శ్రీను (Boyapati Srinu) ..
ఈ కాంబినేషన్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య అభిమానులతోపాటు మాస్ సినిమాల అభిమానులు అందరూ ఈ కాంబోకు ఓటేస్తారు. ఇప్పటికే ఈ కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి.. అలా వచ్చినవన్నీ అదిరిపోయే విజయం అందుకున్నాయి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి కలవబోతున్నారు. ఈ మేరకు #BB4 అంటూ ఓ పోస్టర్‌ను టీమ్ ఈ రోజు లాంచ్ చేసింది కూడా. దాని ప్రకారం సినిమాను ఈ సినిమాను ఈ నెల 16న ముహూర్తానికి ప్రారంభిస్తారు.
ఇక రెండో విషయం సినిమాకు తొలుత నుండి చెబుతున్నట్లు 14 రీల్స్ వాళ్లు నిర్మాతలు అయ్యారు. అయితే బాలయ్య తనయ తేజస్విని కూడా ఓ నిర్మాతగా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అంటే ఇకపై బాలయ్య సినిమాలకు ఆమె డీఫాల్ట్‌గా నిర్మాత అవుతారన్నమాట. ఇప్పటికే ఆమె మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) మొదటి సినిమాకు నిర్మాత అయ్యారు. లెజెండ్ సినిమాస్ పతాకంపై ఆ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో కలసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు.
ఈలోపు బాలయ్యతో సినిమాను అనౌన్స్ చేశారు. రెండింటిలో ఏది ముందు మొదలవుతుంది, ఏది ముందు వస్తుంది అనేది చూడాలి. ఇక బాలయ్య సినిమా ‘అఖండ 2’ (Ahanda) అని అంటున్నారు. ఆ సినిమా తరహాలోనే అన్ని ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమా ఉండొచ్చు అని చెబుతున్నారు. మరి బోయపాటి ఈసారి ఎలాటి కథ సిద్ధం చేస్తారో చూడాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే యాక్షన్ – హిందుత్వ అంశాలు మేళవింపుతో ఓ పాయింట్ ఫైనల్ చేశారట.