వేడుక మధ్యలో సుమ వెళ్ళిపోయింది.. అందుకేనా?

Advertisement

మహేష్ బాబు 25 వ చిత్రమైన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుక మే 1 న (నిన్న) ఘనంగా జరిగింది. వెంకటేష్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ వేడుకకి జనాలు కూడా భారీగా వచ్చారు. ఏ వేడుక అయినా సుమ యాంకర్ గా ఉండాల్సిందే. లేకపోతే ఆ వేడుక జరిగినట్టే అనిపించదు అందంలో అతిశయోక్తి లేదు. అంతలా సుమ తన యాంకరింగ్ తో ఆ వేడుకను నడిపిస్తుంది. ఇక ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకకి యాంకరింగ్ సుమనే చేసింది. అయితే ఈవిడ చివరి వరకూ పాల్గొనలేదు. మధ్యలోనే వెళ్ళిపోయింది. అసలు ఈవిడ ఎందుకు మధ్యలోనే వెళ్ళిపోయింది అనే విషయం పై ఇప్పుడు చర్చ మొదలైంది.

ఇక దీనికి ముఖ్య కారణం తన భర్త రాజీవ్ కనకాలనే అని టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘మహర్షి’ చిత్రంలో రాజీవ్ కనకాల కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైన రాజీవ్ ను, అలాగే పోసానిని కలిపి స్టేజి పైకి ఆహ్వానించింది సుమ. పోసాని తన స్టైల్ లో లవ్ యు రాజా అంటూ కాసేపు కామెడీ చేసి తన స్పీచ్ ను ముగించాడు. ఇక రాజీవ్ మైక్ అందుకున్నాడు. ఈ వేడుకలో రాజీవ్ మాట్లాడే తీరు చూసిన ప్రతీ ఒక్కరికి.. కచ్చితంగా మద్యం సేవించి వచ్చాడని స్పష్టమవ్వక మానదు. ఈ చిత్రం మే 9 న విడుదలవుతుండగా.. రాజీవ్ మాత్రం మార్చి 9 అని చెప్పాడు. మళ్ళీ తను కవర్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. చాలా తడబడుతూ తన స్పీచ్ ను ముగించాడు. ఇది చూస్తున్నంత సేపు సుమ షాక్ లోకి వెళ్ళిపోయినట్టుంది. అంతేకాదు ‘సుమగారు ఏమీ మాట్లాడట్లేదే… అని రాజీవ్ అడిగినప్పుడు.. నేను మ్యూట్ లో ఉన్నాను అని చెప్పకనే చెప్పింది. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తరువాత ఆమె అక్కడినుండీ వెళ్ళిపోయింది. ఈ వేడుకలో సుమ ఎనర్జీ కాస్త తగ్గినట్టే అనిపించింది. బహుశా తన భర్త ప్రవర్తన పట్ల అసంతృప్తి చెంది ఉంటుందని.. ఫిలింనగర్లో డిస్కషన్లు మొదలయ్యాయి. ఇక రాజీవ్ ను కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఏదేమైనా సుమకి ఇదో చేదు అనుభవమనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus