రాజ్ తరుణ్ (Raj Tarun) గత రెండు నెలల నుండి కాంట్రోవర్సీల వల్ల బాగా నలిగిపోయాడు. సరిగ్గా తన సినిమాలను కూడా ప్రమోట్ చేసుకోలేకపోయాడు. ‘తిరగబడరాసామి’ సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో అతను ప్రేమాయణం నడిపాడని, ప్రస్తుతం ఈమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడని.. రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ ప్రియురాలు లావణ్య (Lavanya) పోలీస్ స్టేషన్ మెట్లెక్కి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పలు మీడియా హౌసుల్లో నిర్వహించిన డిబేట్లలో పాల్గొని ఆమె చేసిన కామెంట్లు కూడా ఎవ్వరూ మర్చిపోలేరు.
రాజ్ తరుణ్ (Raj Tarun) తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని, రెండు సార్లు కడుపు చేసి.. తనకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించాడని’ ఇలా ఆమె షాకింగ్ న్యూస్..లు చాలా చెప్పింది. తర్వాత ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ ఎప్పుడో సెపరేట్ అయిపోయాం అని రాజ్ తరుణ్ సైతం చెప్పడం జరిగింది. అయితే ‘ఇదంతా రాజ్ తరుణ్ తన సినిమాల పబ్లిసిటీ కోసం చేసుకున్నారా?’ అంటూ ఓ రిపోర్టర్ ఈరోజు అతన్ని ప్రశ్నించడం జరిగింది.
దానికి అతను ‘ఇలాంటి విషయాలను తెచ్చి ఎవరైనా సినిమా పబ్లిసిటీకి వాడుకుంటారా?అసలు ఆ కేసు వల్లే నా సినిమాలను నేను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయాను’ అంటూ బదులిచ్చాడు రాజ్ తరుణ్. ‘భలే ఉన్నాడే’ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ అలా రాజ్ తరుణ్ ని ప్రశ్నించడం జరిగింది. కొద్దిరోజులుగా లావణ్య సైలెంట్ అయిపోయింది. సినిమా రిలీజ్ టైం వరకు ఆమె రెచ్చిపోయింది. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అందుకే అందరికీ ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కాబోలు..!