టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) బాలయ్య (Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలకు రచయితగా పని చేశారు. బాలయ్యతో మంచి అనుబంధం ఉన్న రచయితలలో పరుచూరి ఒకరు కాగా బాలయ్య నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరుచూరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరుచూరి కామెంట్స్ అభిమానులకు సైతం సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పరుచూరి మాట్లాడుతూ బాలయ్య నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారని ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ కొనసాగించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు.
వచ్చినప్పుడు ఏ పేరుతో ఉన్నారో అదే పేరును కొనసాగించడం కొద్దిమందికే సాధ్యం అని అలాంటి వ్యక్తులలో బాలయ్య ఒకరని పరుచూరి పేర్కొన్నారు. చాలా తక్కువమందికి మాత్రమే అలాంటి పేరు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్యకు దక్కిన ఈ ఘనత విషయంలో ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. బాలయ్య నట జీవితంలో దాదాపుగా 33 సినిమాలకు మేము పని చేశామని నిప్పురవ్వ సెకండాఫ్ బాగుంటే ఆ మూవీ బాలయ్య కెరీర్ లో మరో మైలురాయి అయ్యేదని పరుచూరి అన్నారు.
సమరసింహారెడ్డి (Samarasimha Reddy) సినిమాతో బాలయ్య ఫ్యాక్షన్ హీరో అయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు. అల్లరి పిడుగు (Allari Pidugu) తర్వాత బాలయ్య సినిమాలకు పని చేసే ఛాన్స్ రాలేదని పరుచూరి తెలిపారు. బాలయ్య నేటి తరానికి అనుగుణంగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బాలయ్య నట వజ్రోత్సవం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నానని పరుచూరి(Paruchuri Gopalakrishna) తెలిపారు.
బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు సమయం దగ్గర పడుతుండగా ఈ వేడుకలకు హాజరయ్యే సెలబ్రిటీల వివరాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఓటీటీల్లో విడుదలైన సినిమాలకు సంబంధించి ఆయన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం బాబీ (Bobby) సినిమాకు పరిమితమయ్యారు.