Salaar: డైనోసార్‌ రాక ఆలస్యం… ఇన్ని కారణాలున్నాయా? నిజమేనా?

  • September 5, 2023 / 06:02 PM IST

‘సలార్‌’ సినిమా వాయిదా పడింది… ఈ విషయంలో అఫీషియల్‌ సమాచారం అయితే లేదు కానీ.. అన్‌ అఫీషియల్‌గా చాలా సమాచారం బయటకు వచ్చింది. ముందుగా చెప్పినట్లు ఈ సినిమా సెప్టెంబరు 28న విడుదల కావడం లేదని, నవంబరులో నెలలో రిలీజ్‌ చేస్తారని బాలీవుడ్‌ మీడియాకు లీక్‌ వెళ్లింది. దీంతో అసలేమైంది, ఎందుకు సినిమా రిలీజ్‌ చేయడం లేదు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.

సినిమా ఆలస్యానికి అవే కారణం అని అంటుంటే.. మరికొందరు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు. ‘సలార్‌’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బ్యాలన్స్ ఉన్నాయట. నిజానికి సినిమా ఎప్పుడో పూర్తయిపోయినా ఇంకా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు అవ్వలేదట. అంతా ఓకే అనుకున్నాక చూస్తే.. మార్పులు అవసరం అయ్యాయని, వాటి కోసమే ఇప్పుడు ఆలస్యం అని అంటున్నారు. ప్రస్తుతం అనుకున్న వీఎఫెక్స్‌ పనులు పూర్తవ్వాలంటే మరో నెల అయినా పడుతుంది అని అంటున్నారు. అందుకే సినిమాను నవంబరుకు పంపించారు అని చెబుతున్నారు.

మరోవైపు సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు అంటున్నారు. సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ అనుకున్నారని, అయితే ఇప్పుడు ప్రభాస్‌ షూటింగ్‌లకు వచ్చే పరిస్థితి లేదని, ఆ పాట అయితే కానీ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి కాదు కాబట్టి సినిమా ఆలస్యం అవుతోంది అని మరో వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా… ఈ సినిమా ఇతర భాషల డబ్బింగ్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో అవ్వలేదు అనే ప్రచారమూ జరుగుతోంది. ఈ సినిమాను మొత్తంగా పది భాషల్లో తీసుకొస్తామని అప్పుడెప్పుడో అన్నట్లు సమాచారం.

ఇదంతా సినిమా షూటింగ్‌ విషయం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయం. ఈ విషయాలు పక్కన పెడితే బిజినెస్‌ డీల్స్‌ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడమూ ఓ కారణం అని చెబుతున్నారు. ‘సలార్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అగ్రిమెంట్ ఇంకా పూర్తవ్వలేదు. ఈ మేరకు ఓటీటీ టీమ్‌తో డిస్కషన్స్‌ నడుస్తున్నాయట. ఈ సమయంలో రిలీజ్‌ చేసేస్తే తర్వాత రైట్స్ దగ్గర తక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇలాంటి చాలా కారణాల వల్లే సినిమా రిలీజ్‌ వాయిదా పడింది అంటున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus