Director Krish: క్రిష్ భార్యతో విడిపోవడానికి కారణం ఆమేనా..?

  • May 6, 2021 / 05:13 PM IST

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె సినిమాలతో దర్శకునిగా మంచి పేరును సంపాదించుకున్న క్రిష్ రెండేళ్ల క్రితం భార్య రమ్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రమ్య, క్రిష్ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం అప్పట్లో వెలుగులోకి రాలేదు. అయితే క్రిష్, రమ్య విడిపోవడానికి ఒక హీరోయిన్ కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తోంది. ఆ హీరోయిన్ వల్ల క్రిష్, రమ్య మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది.

2016 సంవత్సరం ఆగష్టు నెల 7వ తేదీన క్రిష్, రమ్యల వివాహం ఘనంగా జరిగింది. రమ్య డాక్టర్ కాగా లేటు వయస్సులో మ్యారేజ్ చేసుకున్న క్రిష్ భార్యతో విడిపోవటం ఇండస్ట్రీకి చెందిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక హీరోయిన్ తో క్రిష్ క్లోజ్ గా ఉండటంతో రమ్య క్రిష్ ను పలుమార్లు హెచ్చరించారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ క్రిష్ సినిమాలో నటించిన ఒక హీరోయిన్ అని తెలుస్తోంది.

2018 సంవత్సరంలో కోర్టును ఆశ్రయించి రమ్య, క్రిష్ విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోవడంతో కోర్టు సులభంగానే క్రిష్, రమ్యలకు విడాకులు మంజూరు చేసింది. మరోవైపు క్రిష్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కరోనా కేసులు తగ్గాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. క్రిష్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగానే పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus