Pathaan,Agent: ‘ఏజెంట్’ మూవీ.. ఆ డౌట్ కి క్లారిటీ ఇచ్చేసిన విలన్ డినో మోరియా

స్పై థ్రిల్లర్స్ కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఆ సబ్జెక్ట్ ను కరెక్ట్ గా డీల్ చేయగలగాలి. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. ఇది కూడా స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమే.దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ ను ప్లాపుల నుండి బయటపడేసింది. మరో రెండు రోజుల్లో అఖిల్ నుండి రాబోతున్న ‘ఏజెంట్’ సినిమా కూడా స్పై థ్రిల్లరే కావడం విశేషం.

అఖిల్ అక్కినేని నటించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు. అయితే టీజర్, ట్రైలర్స్ లో ‘పఠాన్’ మూవీకి దీనికి పోలికలు కనిపిస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై అతను క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అతని పాత్ర… ‘తనకు జరిగిన ఓ ద్రోహం కారణంగా రాక్షసుడిలా మారి, వ్యవస్థకు ఎదురుతిరిగి పగ తీర్చుకునే విధంగా నెగిటివ్ షేడ్స్ కలిగుంటుందని’ తెలిపాడు.

‘పఠాన్’ చిత్రంలో కూడా ఇలాంటి పాత్రే ఉంది. ఆ నెగిటివ్ పాత్రను జాన్ అబ్రహం పోషించాడు. కానీ డినో మోరియా మాత్రం ‘ ‘పఠాన్’ కథకు, ‘ఏజెంట్’ కథకు పోలికే లేదంటున్నాడు. ‘ ‘పఠాన్’ లోనూ, ‘ఏజెంట్’ లోనూ ముగ్గురు గూఢచారులకు సంబంధించిన పాయింట్ ఉండడం యాదృచ్ఛికమైన విషయం.

వాస్తవానికి ‘ఏజెంట్’ (Agent) చిత్రం షూటింగే ముందు ప్రారంభమైంది. కానీ కథ పరంగా చూస్తే పఠాన్ కంటే, ఏజెంట్ ఎంతో విభిన్నమైనది, చాలా ట్విస్ట్ లు ఉంటాయి. తమ చిత్రం విలక్షణంగా ఉండడమే కాదు ఉర్రూతలూగిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు డినో మోరియా.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus