Vijay: విజయ్‌ కొత్త సినిమా ఓకే చేయడం వెనుక ఇంత పెద్ద లాజిక్‌ ఉందా?

  • July 10, 2023 / 05:12 PM IST

వంశీ పైడిపల్లి తర్వాత.. విజయ్‌తో మరో తెలుగు దర్శకుడు సినిమా చేస్తున్నారు ఆ మధ్య వార్తలొచ్చాయి. అంతా ఓకే అయిపోయిందని, త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ అని కూడా చెప్పుకొచ్చారు. ఆ దర్శకుడే గోపీచంద్‌ మలినేని. ‘వీర సింహా రెడ్డి’తో భారీ విజయం అందుకున్న గోపీచంద్‌ కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. అది విజయ్‌ సినిమానే అని గట్టిగా అనుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయి… వెంకట్‌ ప్రభు సినిమా వచ్చింది. దీంతో అసలేం జరిగింది అనే చర్చ జరగుతోంది.

‘క్రాక్‌’ సినిమాతో సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన గోపీచంద్‌ మలినేని ‘వీర సింహా రెడ్డి’తో సాలిడ్‌ హిట్‌ ఇచ్చారు. దీని తర్వాత తెలుగులో ఏ సినిమా చేస్తారు అని చూస్తుంటే తమిళంలోకి వెళ్తున్నారు అని అన్నారు. ఈ మేరకు విజయ్‌ అప్రోచ్ అయ్యి… స్టోరీ వినిపించి, సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయించుకున్నారని టాక్‌. కథ విజయ్‌కి బాగా నచ్చేసింది అంటూ కోలీవుడ్ మీడియా నుండి వార్తలు కూడా వచ్చాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అని అనుకున్నారు.

అయితే ఈ సమయంలో విజయ్ షాక్ ఇస్తూ… కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమాను అనౌన్స్ చేశాడు. గోపీచంద్ మలినేని తర్వాత వెంకట్ ప్రభు విజయ్‌కి కథ వినిపించారు. దీంతో ముందు చెప్పిన కథ పక్కకు వెళ్లిపోయింది అని ఆరా తీస్తే… కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం కొంత క్లారిటీ వస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఓ టాక్‌ నడుస్తోంది. దీనికి సంబంధించిన త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని కూడా అంటున్నారు.

ఇటీవల విజయ్‌ (Vijay) సినిమాలకు మూడేళ్ల బ్రేక్‌ ఇస్తారు అని వార్తలొచ్చాయి. వెంకట్‌ ప్రభు సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేసి.. ఆ తర్వాత రాజకీయాలవైపు వస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకట్‌ ప్రభు సినిమా ఓకే చేశారు అంటున్నారు. ఆ సినిమాలో లోకల్‌ కంటెంట్‌, స్థానిక రాజకీయాల ప్రస్తావన గట్టిగా ఉంటుందట. అందుకే ఆ సినిమాకు ఓటేశారు అని అంటున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus