శివకార్తికేయన్‌తో ఈ జన్మలో మాట్లాడను, అతని సినిమాకి సంగీతం కూడా ఇవ్వను… అంటూ ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఇమ్మాన్ కామెంట్స్ చేశాడు. అదేంటి శివకార్తికేయన్‌తో ఈయనకేం గొడవ, ఏం జరిగి ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరైతే శివకార్తికేయన్ తప్పు చేసే రకం కాదు, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు అంటూ అంచనా వేశారు. అయినప్పటికీ ఏం జరిగింది అనే చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో అనూహ్యంగా మరో మనిషి వచ్చి చేరారు. అయితే ఆ వ్యక్తి కొత్త వాళ్లేం కాదు.
ఇమ్మాన్ దాదాపు 80 సినిమాలకు సంగీతం అందించారు. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వాసం’ సినిమాకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో సినిమాలు పెద్దగా రావడం లేదు, వచ్చినవాటిలో అతని పనితనం మెప్పించడం లేదు కూడా. అయితే ఏమైందో ఏమో… ఇటీవల ఇమ్మాన్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో పెద్ద కలకలం సృష్టించాయి. దానికి కారణం శివకార్తికేయన్, ఇమ్మాన్ ఒకప్పుడు మంచి స్నేహితులు కావడమే.
శివకార్తికేయన్ నటించిన కొన్ని సినిమాలకు (Imman) ఇమ్మాన్ సంగీతం అందించాడు. వ్యక్తిగత కారణాల వల్లే తానీ నిర్ణయం తీసుకున్నానని ఇమ్మాన్ చెప్పాడు. అయితే తన పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆ కారణమేంటో చెప్పను అని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఇమ్మాన్ మాజీ భార్య మోనికా రిచర్డ్ ఈ విషయంలో స్పందించారు. ఇమ్మాన్‌తో తన విడాకుల విషయంలో శివ కార్తికేయన్ తప్పేమి లేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఓహో అసలు విషయం ఇదా అంటూ మరో వాదన మొదలైంది.
ఇమ్మాన్‌కు శివకార్తికేయన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అట. అలా ఇమ్మాన్ దంపతుల మధ్య వచ్చిన చిన్నపాటి సమస్యలను తొలగించేందుకు శివకార్తికేయన్ ప్రయత్నించారట. కానీ ఇమ్మాన్ డివోర్స్ కావాలని పట్టుపట్టారని మోనికా చెప్పారని కోలీవుడ్ టాక్. ఇప్పుడు ఆ కారణం చేతే శివకార్తికేయన్ విషయంలో ఇమ్మాన్ ఇలా మాట్లాడారు అని ఆమె చెప్పారు.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!