Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

వెంకటేశ్‌ సినిమా కెరీర్‌లో ఎన్నో హిట్‌ సినిమాలు, సూపర్‌ హిట్‌ సినిమాలు, బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు చేశారు. వాటిలో ‘దృశ్యం’ సినిమాలు చాలా స్పెషల్‌. వెంకటేశ్‌కి ఉన్న ఫ్యామిలీ స్టార్‌ ఇమేజీ, దానికి థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ జోడించి తెరకెక్కిన సినిమాలు ఇవి. తొలుత మలయాళంలో మోహన్ లాల్‌ చేసిన ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్‌ చేశారు. రెండో భాగం విషయంలోనూ అదే జరిగింది. అయితే ఇప్పుడు మూడో ‘దృశ్యం’ విషయంలో వెంకటేశ్‌ అండ్‌ కో. ఆలోచన మారిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

Venkatesh

12 ఏళ్ల క్రితం ‘దృశ్యం’ సినిమా చేసేటప్పుడు, ఐదేళ్ల క్రితం ‘దృశ్యం’ సినిమా చేసేటప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. ఇప్పుడు ప్రేక్షకులకు ఇతర భాషల సినిమాలు బాగా దగ్గరయ్యాయి. థియేటర్లకు వెళ్లే చూసేస్తున్నారు. దీనికి మలయాళ సినిమాలు కూడా అతీతం కాదు. ఇలాంటి సమయంలో ‘దృశ్యం 3’ సినిమా మలయాళంలో వచ్చిన కొన్ని నెలల తర్వాత చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అనే చర్చ జరుగుతోందట. అందుకే ‘దృశ్యం 3’ ప్రాజెక్ట్‌ ఆలోచనను విరమించుకుంటారు అని సమాచారం.

దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఇప్పుడు మలయాళ ‘దృశ్యం 3’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. రిలీజ్‌ అయ్యాక టాలీవుడ్‌కి వచ్చి వెంకటేశ్‌తో సినిమా చేస్తారనేది తొలుత అనుకున్న ప్లాన్‌. ఎంత వేగంగా చేసిన మూడు నుండి నాలుగు నెలలు పడుతుంది. ఈ లోపు వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా ‘ఏకే 47’ అయిపోవాలి. అలా ఏ విధంగా చూసినా ఈ ఏడాది ఆఖరు వచ్చేస్తుంది. అదే జరిగితే వచ్చే సంక్రాంతికి అనిల్‌ రావిపూడి సినిమా ఇచ్చే పరిస్థితి లేదు.

అప్పటికే మలయాళ ‘దృశ్యం 3’ ఓటీటీలోకి వచ్చేస్తుంది. మనవాళ్లు చూసేస్తారు కూడా. ట్విస్ట్‌లన్నీ బయటకు వచ్చేస్తాయి. దాని వల్ల తెలుగు ‘దృశ్యం 3’ మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఈ లెక్కలన్నీ చూసే వెంకటేశ్‌ అండ్‌ కో. ఆగిపోతున్నారని సమాచారం.

: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus