Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

నేటి తరం యువత తెగ మెచ్చేస్తున్న జోనర్లు యాక్షన్‌, రివేంజ్‌, రస్టిక్‌, రూరల్‌ డ్రామాలు. వీటన్నిటిని కలిపి ఒక ఒక వెబ్‌ సిరీస్‌గా సిద్ధం చేసింది తమడా మీడియా. అదే ‘ఇసకపట్నం’ (Isakapatnam). ఓ సముద్ర తీర ప్రాంతంలో అందరినీ భయపెట్టి రాజుగా కొనసాగుతున్న నాయుడు అనే వ్యక్తిని నేలకు దింపిన ఓ సమూహం కథే ఈ ‘ఇసకపట్నం’ అని చెప్పొచ్చు. ఇందులో ఓ కుర్చీ కోసం కొట్లాట.. దాని కోసం ఆ తీర ప్రాంతంలో రేగిన రక్తపాతం ఇలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

Isakapatnam Trailer

ఐశ్వర్య రాజేశ్‌, సముద్రఖని, సునీల్‌, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఇసకపట్నం’ వెబ్‌ సిరీస్‌ను తెలుగులో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసి ఆ తర్వాత ‘స్పై’ సినిమాతో దర్శకుడిగా మారిన గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించారు. రాహుల్‌ తమడా, సాయిదీప్‌ రెడ్డి బొర్రా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ రగతి కథ అందించగా, సయ్యద్‌ తాజుద్దీన్‌ మాటలు రాశారు.

1990ల కాలంలో ఇసకపట్నం అనే పోర్టు టౌన్‌ నేపథ్యంలో సాగుతుంది. నాయుడు అనే ఓ కరుడగట్టిన వ్యక్తి డబ్బు మదంతో ఆ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టి ఏలుతుంటాడు. అలాంటి సమయంలో న్యాయం కోసం పోరాడే ఓ యువతి, నమ్మకస్తుడైన అనుచరుడు, ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ సామాన్యుడు ఏం చేశారు అనేదే ప్రధాన కథ.

‘ఇసకపట్నం సిరీస్‌’ అయినా.. సినిమా కోసం పెట్టాల్సిన ఖర్చు పెట్టారు నిర్మాతలు రాహుల్‌ తమాడా, సాయిదీప్‌ రెడ్డి బొర్రా. ఆ నిర్మాణ విలువలు ట్రైలర్‌లో బాగా కనిపిస్తున్నాయి. సయ్యద్‌ తాజుద్దీన్‌ డైలాగ్‌లు సమాజానికి గట్టిగా తగిలేలా ఉన్నాయి.

‘‘చరిత్ర మార్చి సంతకం పెట్టేవాళ్లకు, సంతకాన్నే చరిత్రగా మార్చేవాళ్లకు చాలా తేడా ఉంది’’.. ‘‘నాయుడు బలాన్ని చంపడం కష్టం.. కానీ లాక్కోవడం తేలిక’’, ‘‘ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే చంపాల్సిన అవసరం లేదు. చచ్చేంత పని చేస్తే చాలు’’ లాంటి డైలాగ్స్‌ ఈ సిరీస్‌ కథేంటే చెప్పకనే చెబుతున్నాయి. మరి ఆ కథ మీ ఇళ్లకు వచ్చేది ఎప్పుడు అనేది కూడా చెప్పాలిగా రాబోయే జులై 2.

 

 

రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus