టాలీవుడ్ సినిమాల రూపకల్పన మాట ఎలా ఉన్నా...సెన్సార్ వ్యవహారమే కాస్త ఘాటుగా ఉంటుంది....అసలు ఏ సినిమాకు ఎప్పుడు ఏ సర్టిఫికేట్ వస్తుందో....బహుశా సెన్సార్ బోర్డ్ వాళ్ళకే పెద్దగా తెలియక పోవచ్చు....ఇక అదే క్రమంలో ఈ సెన్సార్ బోర్డ్ పై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి....అయితే అవన్నీ పక్కన పెడితే....కల్యాణ్ రామ్ హీరోగా....నిర్మాతగా...పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కించిన చిత్రం "ఇజం". ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న కసితొ నటించిన కల్యాణ్ రామ్..సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని....పాసిటివ్ టాక్ తో బయటకు వచ్చింది. అసలైతే...పూరీ జగన్నాధ్ సినిమాలు అంటే....పంచ్ డైలాగ్స్ తో కూడిన భూతులు...అక్కడక్కడా...రొమాంటిక్ సీన్స్....పాటల్లో అందాల ఆరబోత....ఇంకా పైకి వెళితే...మంచి ఐటమ్ సాంగ్ వెరసి....18+ మాత్రమే చూడగలిగేలా తెరకెక్కిస్తాడు...అయితే అందరు "ఇజం" కూడా అలానే ఉంటుంది ఏమో అని అనుకున్నారు...కానీ సెన్సార్ పుణ్యమా అని....ఈ సినిమాకు "యూ/ఏ" సర్టిఫికేట్ వచ్చింది....అక్టోబర్ 21న రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ సినిమాకి అందరూ...''ఏ'' సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తారేమో అని అనుకున్నారు కానీ...మొత్తానికి అలా "యూ/ఏ" సర్టిఫికేట్ ఇచ్చి బయటకు పంపేశారు. ఇక పోతే....సెన్సార్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం.....రొమాంటిక్ ట్రీట్ వంటి ఫస్టాఫ్.. అలాగే కాస్త హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్లతో కూడిన సెకండాఫ్ ''ఇజం'' సినిమాను ఒక మసాలా కమర్షియల్ సినిమాగా సూపర్ హిట్ చేస్తాయి అని ఇన్‌సైడ్ టాక్... చూద్దాం మై ఏం జరుగుతుందో. https://www.youtube.com/watch?v=wS_tSH9Q5uU