విజయ్ చిత్రానికే.. అల్లు అరవింద్ ఇరుక్కున్నాడు..?

Advertisement

‘గీత ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ కు ఐటీ అధికారులు షాకిచ్చారు. గత సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్న ‘గీత గోవిందం’ చిత్రం 130 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అత్యంత లో బడ్జెట్ లో రూపొందించిన ఈ చిత్రానికి 4 రెట్లు లాభాలు వచ్చాయని ట్రేడ్ పండితులు గతంలో చెప్పుకొచ్చారు. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన ఆదాయం విషయంలో ఆరా తీసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారట.

ఈ చిత్రాన్ని నిర్మించిన ‘జి.ఏ2 ప్రొడక్షన్స్’ సంస్థ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారట. తెలంగాణా, హైదరాబాద్‌ కి చెందిన ఐటీ యూనిట్‌-14 బృందం.. ఈ ఆఫీస్ లో కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించారట. ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ చిత్రానికి 130 కోట్ల వసూళ్ళు వస్తే పన్ను చెల్లింపుల విషయంలో సంస్థ అధినేతలను ఇతర కార్యాలయ సిబ్బందిని కూడా అధికారులు విచారించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పరశురామ్(బుజ్జి) కెరీర్లోనూ అలాగే విజయ్ దేవరకొండ – రష్మిక కెరీర్లో కూడా ఇదే బిగ్గెస్ట్ హిట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news