సినిమా మేకింగ్‌లో ఓ కాన్సెప్ట్ ఉంటుంది. ఓ సీన్ అటు, ఓ సీన్ ఇటు షూట్ చేసి తర్వాత కలుపుకుంటారు కానీ.. ఐటెమ్ సాంగ్ విషయంలో మాత్రం ఆఖరి వరకు ఆగుతారు. సినిమా షూటింగ్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి అనుకుంటున్న సమయంలో ఐటెమ్ సాంగ్‌కి సంబంధించిన పనులు మొదలుపెడుతుంటారు. దీంతో అప్పుడు మాత్రమే ‘ఎవరా ఐటెమ్ సాంగ్ గర్ల్’ అనే చర్చ మొదలవుతుంది. హీరోయిన్లు, మాజీ హీరోయిన్లు, గ్లామర్ డాల్స్.. ఇలా చాలామంది పేర్లు చర్చకు వచ్చి ఫైనల్‌గా ఒకరు ఫైనల్ అవుతారు.
ఈ ప్రాసెస్‌లో హీరోయిన్లు కుదరక సినిమా షూటింగ్‌లు వాయిదా పడి సినిమా రిలీజ్ వాయిదా పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ తలనొప్పి తమకు వద్దు అనుకున్నారో ఏమో NBK 111 సినిమా టీమ్ ఇప్పుడే ఐటెమ్ సాంగ్ సంగతి ఆలోచిస్తున్నారట. అంటే పాట రాయించేసి, ట్యూన్ కట్టించేసి ఊరుకోవడం లేదు. అన్నీ కుదిరితే వీలైనంత త్వరగా పాటను చిత్రీకరించేయాలి అని కూడా అనుకుంటున్నారట. అందుకే ఐటెమ్ భామను ఓకే చేసే పనిలో పడ్డారు అని సమాచారం.
బాలకృష్ణ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మాస్ బీట్‌కి, బాలయ్య మాస్ స్టెప్పులు కలసి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పాట హిట్ అయిపోతుంది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా కోసం కూడా పాట అనుకుంటున్నారట. దీని కోసం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ కొంతమంది కథానాయికల పేర్లని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ పేరు తెరపైకొచ్చింది.
ఆమె టీమ్‌తో ఇప్పటికే గోపీచంద్ మలినేని టీమ్ మాట్లాడారని.. వన్స్ ఓకే అవ్వగానే షూటింగ్ పనులు షురూ చేస్తారని టాక్. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ‘వీర సింహారెడ్డి’ తర్వాత గోపీచంద్ – బాలయ్య కాంబోలో రూపొందుతున్న సినిమా ఇది. ‘పెద్ది’ సినిమా నిర్మాత వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.