Auto Ram Prasad: అనారోగ్య సమస్యల గురించి క్లారిటీ ఇచ్చిన ఆటో రాంప్రసాద్!

Advertisement

జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్లుగా ఎంతో మంది మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు. జబర్దస్త్ లో తన పంచులతో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన రాంప్రసాద్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఇలా ప్రస్తుతం బుల్లి తెరమీద ప్రసారమవుతున్న టీవీ షోలలో సందడి చేస్తూ తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా సినిమాలలో కూడా మంచి మంచి పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా రాంప్రసాద్ గురించి గత కొంతకాలంగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా రాంప్రసాద్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రాంప్రసాద్ తలకి క్యాప్ పెట్టుకున్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ… తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాంప్రసాద్ ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల కిరాక్‌ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్‌ రెండో బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు జబర్దస్త్‌ ఆర్టిస్టులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు.ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌ను తన ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. “తన అనారోగ్యం గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టం చేశాడు.

‘నాకు క్యాన్సర్‌ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను తలకు క్యాప్ పెట్టుకోవడంతో అంతా నాకేదో అయ్యిందని ఆందోళన పడ్డారు. నాకు ఏం కాలేదు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవడం వల్ల అలా క్యాప్ పెట్టుకున్నాను. అంతేకానీ నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు” అంటూ రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus