Jabardasth Praveen: పై మాకు హ్యాండ్ ఇచ్చిన ప్రవీణ్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పాలి. ఇలాంటి జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రవీణ్ ఫైమా జంట ఒకటి. ప్రవీణ్ పైమా ఇద్దరు కలిసిఎన్నో అద్భుతమైన స్కిట్లలో చేసేవారు ఇక వీరిద్దరు కూడా వ్యక్తిగతంగా ప్రేమలో ఉన్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ దీని గురించి సరైన క్లారిటీ మాత్రం లేదని చెప్పాలి.

ఇలా ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్న ఫైమాకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ప్రస్తుతం స్టార్ మా లో సెటిల్ అయ్యారు. కానీ ప్రవీణ్ మాత్రం ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నారు. ఒకప్పుడు కమెడియన్ గా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రస్తుతం టీం లీడర్ గా మారిపోయారు.ఇలా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా పటాస్ ప్రవీణ్ పైమా కు హ్యాండ్ ఇచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటో అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా వీరి పెళ్లిని కొమరక్క దగ్గర ఉండి చేశారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రవీణ్ ఫైమాను మోసం చేశారంట పెద్ద ఎత్తున ఈ వీడియో పై కామెంట్ వస్తున్నాయి.

ఇక ఈ విషయంపై స్పందించిన ( Praveen) ప్రవీణ్ తాను నిజంగానే పెళ్లి చేసుకోలేదని కేవలం కొమరక్క యూట్యూబ్ ఛానల్ వీడియో కోసం మాత్రమే ఈ పెళ్లి వీడియో చేశాము అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రవీణ్ ఫైమా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ అవకాశం అందుకొని ఫైమా రేంజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈమె ప్రవీణను పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న సందేహాలను కూడా వ్యక్త పరుస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus