Sowmya Rao: ‘జబర్దస్త్’ కు మరో షాక్.. కొత్త యాంకర్ సౌమ్య రావు గురించి షాకింగ్ న్యూస్ వైరల్..!

  • December 28, 2022 / 11:22 AM IST

‘జబర్దస్త్’ నుండి మెయిన్ పిల్లర్స్ అన్నీ తప్పుకున్నా.. షో మాత్రం ముందు నుండి ఏర్పరుచుకున్న క్రేజ్ వల్ల సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. ఇప్పటికే జడ్జిలతో పాటు టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్.. ఆఖరికి యాంకర్స్ వంటి వారు తప్పుకున్నారు. అన్నీ ఎలా ఉన్నా ‘జబర్దస్త్’ కు యాంకర్ అనసూయ తన గ్లామర్ షోతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది. కానీ అనూహ్యంగా ఆమె తప్పుకుంది. దీంతో సౌమ్య రావ్ అనే కొత్త యాంకర్ ఆమె ప్లేస్ లో వచ్చింది.

ఈ కన్నడ బ్యూటీ సీరియల్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఈమెకు తెలుగు అంతంత మాత్రమే వచ్చు. కానీ ప్రేక్షకులకు ఈమె మాట్లాడే విధానమే బాగా నచ్చింది. అయితే.. ఇప్పుడు జబర్దస్త్ నుండి యాంకర్ సౌమ్య తప్పుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయట. సౌమ్య రావు పై బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువయ్యాయట. అవి ఆమెను బాగా హర్ట్ చేస్తున్నాయట. అంతేకాకుండా సెట్లో కూడా షో నిర్వాహకులు ఈమెను డబుల్ మీనింగ్ డైలాగులతో వేధిస్తున్నట్లు సమాచారం.

కుదిరితే ఈమెను లొంగదీసుకోవాలని కొంతమంది పెద్దలు కూడా భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. అందుకే సౌమ్య రావు ఇబ్బందిగా ఫీలవుతోందట. ప్రస్తుతం ఈమెకు జబర్దస్త్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ‘జబర్దస్త్’ తో ఈమెకు వచ్చిన క్రేజ్ తో వేరే షోలో లేదా సీరియల్స్ వంటి వాటిలో అవకాశం వస్తే వెంటనే జంప్ అవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె ఆ ప్రయత్నాల్లో బిజీగా గడుపుతుందట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus