‘అదిరింది’ వచ్చినా ‘జబర్దస్త్’ ను మ్యాచ్ చేయలేకపోయింది..!

  • January 8, 2020 / 06:26 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షోకి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల కామెడీ సినిమాలను కూడా జనాలు చూడటం మానేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వల్ల ‘జబర్దస్త్’ కు దెబ్బపడుతుందేమో అని అంతా భావించారు. విషయంలోకి వెళితే.. ఈ షో కి ఇప్పటి వరకూ జడ్జిగా వ్యవహరిస్తూ వస్తోన్న నాగబాబు.. తప్పుకోవడం, అలాగే ఆయనతో పాటు మరికొంత మంది కూడా జంప్ అవ్వడంతో ఈ సందేహాలు నెలకొన్నాయి. ‘అదిరింది’ అనే షోకి వీరంతా చేరుకున్నారు.

ఈ కారణంతో సహజంగానే ‘జబర్దస్త్’ .. షోకి ఆదరణ తగ్గిపోతుందని… ‘అదిరింది’ షో దూసుకుపోతుందని కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ కట్ చేస్తే… ‘జబర్దస్త్’ షోకి ఎంతమాత్రం రేటింగ్ తగ్గలేదు. మరోవైపు ‘అదిరింది’ రేటింగ్ ఊహించనంతగా నమోదు చెయ్యట్లేదు. ‘అదిరింది’ ప్రసారమయ్యే సమయానికి మరో చానల్ లో ‘జబర్దస్త్’ పాత స్కిట్స్ లోని హైలైట్స్ టెలికాస్ట్ చేస్తుండడంతో.. అందరూ మళ్ళీ వాటినే ఎక్కువగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఇలా ఉంది.. మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి..!

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus