నా ముక్కు, పేరు మార్చుకోమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!

  • March 7, 2020 / 08:13 PM IST

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు వ్యక్తులు తన పేరుని, ముక్కుని మార్చుకోమన్నారని బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెబుతున్నారు. శ్రీలంకకి చెందిన ఈ బ్యూటీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ముంబైకి షిఫ్ట్ అయ్యారు. 2009లో ‘అల్లాదీన్’ అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుందని చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను నాలానే ఉండాలనుకున్నానని.. ఆ సమయంలో కొందరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అనే పేరు వినడానికి మరీ పాశ్చాత్యంగా ఉందని పేరు మార్చుకోమని చెప్పారని.. ముస్కన్ అనే పేరు సూచించారని.. కానీ పేరు మార్చుకోవడం నాకిష్టం లేదని చెప్పారు. మరికొందరు చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైన ముక్కుని కూడా మార్చుకోమని చెప్పినట్లు తెలిపింది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus