ఒక సినిమాకు ఎన్ని కష్టాలు రాకూడదో.. అన్ని కష్టాలూ వచ్చాయి ఆ సినిమాకు. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు అని ఓ వైపు బాధపడుతుంటే, ఇంకోవైపు సినిమాను పూర్తిగా లీక్ చేసేశారు. ఎంతలా లీక్ అయింది అంటే కోటి మందికిపైగా సినిమా పైరసీ వెర్షన్ చూసేశారు అని అధికారులే చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల నిర్మాత, దర్శకుడు, నటులు ఎంత మనో వేధన గురై ఉంటారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాకు ఎట్టకేలకు సాంత్వన దొరుకుతోంది అని అంటున్నారు.
పైన విషయాలు చెప్పిన సినిమా ‘జన నాగయన్’ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది అని అంటున్నారు. అవును మీరు చదివింది నిజమే.. ఈ సినిమా సెన్సార్ చిక్కుల్ని దాటుకొని ముందుకొస్తోంని సమాచారం. ఇటీవల సెన్సార్ రివైజింగ్ కమిటీ ఈ సినిమాను వీక్షించందట. అంతేకాదు ఈ సినిమాను ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేసిందట. దీంతో సినిమాను రిలీజ్ చేయొచ్చు అని అంటున్నారు.
సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో కొన్ని సంభాషణలను మ్యూట్ చేయడంతోపాటు, కొన్ని సన్నివేశాలను తొలగించాలని చెప్పిందట. ఇవన్నీ చేసి త్వరలో సినిమాను చేయాలని అనుకుంటున్నారట. అయితే, ఈ మార్పులను సెన్సార్ రివైజింగ్ కమిటీ చూసి ఓకే చేయాల్సింది ఉంది. దీనికిగాను జులై 16న డేట్‌గా చెప్పిందట. అంటే ఆ రోజు ఫైనల్ అవుతుంది. ఆ రోజు ఓకే అయితే జులై ఆఖరి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అంటే జులై 24న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న.. ప్రభుత్వం మీద ప్రశ్నలు వేసినట్లు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఆ సినిమా హీరో విజయ్ పార్టీనే. మరిప్పుడు ఏం చేస్తారు? అందులో కొన్ని ప్రశ్నలు తన ప్రభుత్వం మీద ఉండే అవకాశం ఉంది. చూడాలి సినిమా వచ్చాక క్లారిటీ వస్తుంది.