జాన్వీ కపూర్ తిప్పుడు మామూలుగా లేదు

  • January 13, 2021 / 11:57 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందంలోనే కాదు డ్యాన్స్ లోను గట్టిగానే రాటు దేలుతోంది. గతంలో ఎన్నో సార్లు అమ్మడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసినప్పటికీ ఇటీవల మాత్రం అంతకు మించి అనేలా ఆకర్షిస్తోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. రోజుకో గ్లామర్ లుక్ తో లక్షల్లో లైకులు అందుకుంటోంది. ఇక ఇటీవల ఆల్ మోస్ట్ బెల్లి డ్యాన్స్ తరహాలో నడుమును 360డిగ్రీస్ లో తిప్పేసింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా నడుము అందాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టేసింది. ఏ మాత్రం వల్గర్ గా అనిపించకుండా చాలా స్టైలిష్ గా కుర్రకారుకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లలో వైరల్ గా మారుతోంది. ఇక దడఖ్ సినిమాతో బాలీవుడ్ తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అనంతరం గుంజన్ సక్సేనా సినిమాతో అంతకంటే ఎక్కువ స్థాయిలో హిట్టు కొట్టాలని అనుకుంది.

కానీ లాక్ డౌన్ దెబ్బకు సినిమా డైరెక్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలయ్యింది. సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోయినప్పటికి అమ్మడి నటనకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఇక ప్రస్తుతం కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరో సినిమా చేస్తోంది.


Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus