‘జాతి రత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • March 12, 2021 / 12:36 PM IST

న‌వీన్ పోలిశెట్టి,ఫ‌రియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి వంటి స్టార్ కమెడియన్స్ కూడా టైటిల్ రోల్స్ ప్లే చేశారు. ‘స్వ‌ప్న సినిమా’ బ్యాన‌ర్ ‌పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇటీవల విడుదలైన ‘చిట్టి నీ నవ్వంటే’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో పాటు ప్రొమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై మంచి హైప్ ఏర్పడింది. ఇక మార్చి 11న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి అనే చెప్పాలి.

ఇక ‘జాతి రత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే :

నైజాం   1.42 cr
సీడెడ్   0.57 cr
ఉత్తరాంధ్ర   0.45 cr
ఈస్ట్   0.32 cr
వెస్ట్   0.29 cr
గుంటూరు   0.39 cr
కృష్ణా   0.24 cr
నెల్లూరు   0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   3.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.08 cr
ఓవర్సీస్   0.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   4.78 cr

‘జాతి రత్నాలు’ చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం 4.78కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు మరో 6.52కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటిరోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.. పోటీగా మరో 3 సినిమాలు విడుదలైనప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ చిత్రం.ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి… చూస్తుంటే ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించేలా కనిపిస్తుంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus