జీవిత రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. శివాత్మిక నటించిన పంచతంత్రం మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో జీవిత మాట్లాడుతూ సినిమా వాతావరణంలోనే నా కూతుళ్లు పెరిగారని అన్నారు. శివాని, శివాత్మిక సినిమాల్లోకి వస్తామని చెప్పిన వెంటనే మేము ఎంతో టెన్షన్ పడ్డామని జీవిత కామెంట్లు చేశారు.
శివాని, శివాత్మికలకు చిన్న వయస్సు నుంచి ఏం కావాలంటే వాటిని ఆస్తులు అమ్మి కొనిచ్చామని జీవిత అన్నారు. కానీ సినిమాల్లోకి రావడం అంత సులువు కాదని జీవిత పేర్కొన్నారు. సినిమా రంగంలో మంచి పాత్రలు లభించడం, ఫేమ్ రావడం లేదా పోవడం విధిరాతపై ఆధారపడి ఉంటుందని జీవిత కామెంట్లు చేశారు. ఇది డబ్బుతో కొనలేమని ఆమె అన్నారు. ఈ రీజన్ వల్లే శివాని, శివాత్మిక విషయంలో చాలా టెన్షన్ పడ్డామని జీవిత వెల్లడించారు.
అయితే శివాని, శివాత్మిక ఇష్టాల ఆధారంగా వాళ్లను సపోర్ట్ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాని, శివాత్మిక సినిమా రంగంలో మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో శివాని శివాత్మిక హీరోయిన్లుగా మరింత ఎదుగుతారేమో చూడాల్సి ఉంది. శివాని శివాత్మికలకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుతోందని తెలుస్తోంది.
శివాని, శివాత్మిక కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంచి కథలకు మాత్రమే వీళ్లిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. శివాని, శివాత్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏడాదికి కచ్చితంగా ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా శివాని, శివాత్మిక ప్లాన్ చేసుకుంటున్నారు. శివాని శివాత్మిక స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!