Bigg Boss 5 Telugu: ఆ విషయంలో జెస్సీ, సిరి, షణ్ముక్ లు బాధపడ్డారా..?

  • October 8, 2021 / 11:50 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించని పరిస్థితి. హౌస్ మేట్స్ ఒకటి అనుకుంటే బిగ్ బాస్ ఇంకోటి చేస్తాడు. ఫస్ట్ వచ్చింది ఒకలాగా ఉంటే నెక్ట్స్ వచ్చేది ఇంకోలా ఉంటుంది. సరిగ్గా ఐదోవారం టాస్క్ లో ఇదే జరిగింది. రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో భాగంగా సన్నీ రాజ్యం, రవి రాజ్యం అంటూ రెండు రాజ్యాలుగా హౌస్ విడిపోయింది. ఇద్దరూ రాకుమారులుగా టాస్క్ చేస్తుంటే మిగతా హౌస్ మేట్స్ ప్రజలుగా మారి వాళ్లు మద్దతు ఇస్తే రాకుమారుడు రాజు అవుతాడు. అంతేకాదు, ధనం ఎక్కువగా ఉన్న రాకుమారుడు కెప్టెన్సీ పోటీదారుడు అవుతారని, అలాగే ధనాన్ని సంపాదించిన ప్రజలు కూడా కెప్టెన్సీ పోటీదారులుగా మారతారని టాస్క్ పంపించాడు బిగ్ బాస్.

దీంతో ఎవరి ప్లాన్ వాళ్లు వేశారు. ఫైనల్ గా సన్నీ రాజ్యంలో సన్నీ గెలవకపోయినా కూడా ప్రజలు ఎక్కువ ధనంతో ఉన్నారు కాబట్టి మానస్, షణ్ముక్, ఇంకా జెస్సీలు కెప్టెన్సీ పోటీదారులుగా అవ్వొచ్చని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి గూబలు పగిలిపోయాయ్. రెండోసారి టాస్క్ పేపర్ పంపిన బిగ్ బాస్. రవి రాజుగా మారాడు కాబట్టి, సన్నీ దగ్గర ఉన్న ధనాన్ని స్వాధీనం చేసుకునే హక్కు లభిస్తుందని, అది తన రాజ్యంలో నచ్చిన ముగ్గురు హౌస్ మేట్స్ కి పంచి ఇవ్వచ్చని చెప్పాడు. అప్పుడు వాళ్లలో కెప్టెన్సీ అర్హత సాధించిన వాళ్లు ఎవరుంటారో చెప్పమని చెప్పాడు.

దీంతో ఎక్కువ ధనం సంపాదించినా కూడా షణ్ముక్, జెస్సీ, మానస్ ల శ్రమ వృధా అయిపోయింది. ఈవిషయం తెలియగానే సిరి సన్నాయి నొక్కులు నొక్కుతూ.. మొత్తం వేస్ట్ అయిపోయింది అంటూ బాధపడింది. జెస్సీ ఇంకా షణ్ముక్ లు కూడా బాధపడ్డారు. ఇక్కడే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఈసీజన్ మొత్తం కెప్టెన్ అవ్వలేని ప్రియకి సైతం అవకాశం కల్పించాడు. ఎవరైనా పోటీదారుల్లోనుంచీ తప్పుకుని త్యాగం చేస్తే ప్రియ కెప్టెన్సీ పోటీదారులు అవ్వొచ్చని, అలాగే ఈ సీజన్ మొత్తం కూడా ఆమె కెప్టెన్ గా అర్హత సాధిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హమీదా రేస్ నుంచి పక్కకి తప్పుకుని ప్రియకి అవకాశాన్ని ఇచ్చింది. అదీమేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus