Jogi Naidu: ఝాన్సీ పై ఆమె మాజీ భర్త జోగినాయుడు ఎమోషనల్ కామెంట్స్ వైరల్ !

యాంకర్ ఝాన్సీ అందరికీ సుపరిచితమే. యాంకర్ సుమ తర్వాత ఆ స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ను సంపాదించుకుంది ఝాన్సీ. అడపా దడపా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తుంది. ఈమెలో మంచి నటి కూడా ఉంది. ఎప్పటికప్పుడు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంది.ఈమె పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె గతంలో బుల్లితెర నటుడు జోగి నాయుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో వీళ్ళు విడిపోయారు.

ఈ విషయం పై ఝాన్సీ కానీ జోగినాయుడు (Jogi Naidu) కానీ ఎప్పుడూ మాట్లాడింది లేదు. జోగినాయుడు మాత్రం ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా జాన్సీతో పెళ్లి గురించి, విడిపోవడం గురించి జోగినాయుడు నోరు విప్పాడు. ఆయన మాట్లాడుతూ.. “1995లో ఝాన్సీ నాకు పరిచయమైంది. ఆ టైంలో ఆమె ఇంటర్ చదువుతోంది. జీకే మోహన్ తీసిన ఓ సినిమాలో ఆమె నటించింది. అప్పుడు నేను జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాను.

ఆ సమయంలోనే మా మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. మేము మొదటిసారి కలుసుకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇప్పటికీ సంతోషపడుతూ ఉంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, తను యాంకర్గా కెరీర్ లు ప్రారంభించాం. చిన్న స్థాయి నుండి పైకి ఎదుగుతూ వచ్చాం. దాదాపు తొమ్మిదేళ్లపాటు మేమిద్దరం కలిసే ఉన్నాం. కానీ ఇద్దరం మంచి స్టేజీకి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఏడాదిలోనే విడిపోవాల్సి వచ్చింది.

అప్పటికి మాకు ధన్య అనే కూతురు ఉంది. కలిసుండాలని నేను చాలా ప్రయత్నించాను కానీ కుదర్లేదు. మా బంధం అక్కడి వరకే రాసిందేమో. కానీ నేనైతే ఆ బాధ నుండి 8 ఏళ్ళు డిప్రెషన్లో ఉండిపోయాను. బ్రహ్మానందం నాకు ఓ తండ్రిగా.. అండగా నిలబడి మమ్మల్ని కలపాలని ప్రయత్నించారు. ఆయన వల్ల కాలేదు. చిరంజీవి కూడా ఎంతో బిజీ స్టార్ అయ్యుండి కూడా ఝాన్సీతో 2 ,4 గంటలు మాట్లాడారు. అయినా వర్కౌట్ కాలేదు” అంటూ జోగి నాయుడు చెప్పుకొచ్చారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus