Siddharth: ఆ హీరోయిన్ ఉసురు తగలడం వల్లే సిద్దార్థ్ కెరీర్ నాశనం.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సిద్దార్థ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయడం వల్ల ప్రస్తుతం సిద్దార్థ్ సినిమాలకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. సిద్దార్థ్ పారితోషికం ప్రస్తుతం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సిద్దార్థ్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. అయితే స్టార్ హీరోయిన్ సమంత ఉసురు తగలడం సిద్దార్థ్ కెరీర్ ఈ విధంగా ఉందని జర్నలిస్ట్ ఇమంది రామారావు కామెంట్లు చేశారు.

సిద్దార్థ్, సమంత ఒకానొక సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. శ్రీకాళహస్తిలో సిద్దార్థ్, సమంత పూజలు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల సిద్దార్థ్, సమంత విడిపోయారు. జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్దార్థ్, సమంత మధ్య ప్రేమ పుట్టిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇమంది రామారావు కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దార్థ్ నటించిన చిన్నా మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో చిన్నా సినిమా ఫెయిలైంది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఓటీటీలో అయినా ఈ సినిమా హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

సిద్దార్థ్ (Siddharth) సినిమాలను చాలామంది ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. తెలుగులో సిద్దార్థ్ కు పూర్వ వైభవం రావడం కష్టమేనని తెలుస్తోంది. సమంత కెరీర్ విషయానికి వస్తే సామ్ ఈ ఏడాది ఖుషి సినిమాతో సక్సెస్ సాధించారు. సమంత నటించిన సిటాడెల్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus