Salman Khan: సల్మాన్ ఖాన్ చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

  • May 4, 2023 / 12:04 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నోటి వెంట ‘ఐ యామ్ సల్మాన్’ తప్పితే మరో మాట రావడం లేదు. సల్మాన్ ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’. అవును.. ఇప్పుడీ ప్రపంచంలోకి సల్మాన్ కూడా చేరిపోయాడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ వీడియోని చూసి చూసి సల్మాన్ పూర్తిగా అందులో లీనమైపోయాడు. మీడియా సమావేశంలో కూడా సల్మాన్ ఆ మాట తప్పితే వేరే మాట చెప్పలేదు.

దీంతో మీడియా వారు కూడా పరార్ అయ్యారు. ఈ విషయంలో తాజాగా మార్వెల్ వారు వదిలిన వీడియోని చూస్తే అర్థమవుతుంది. విషయంలోకి వస్తే.. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ ఈ వారం విడుదలకానుంది. అందుకే అభిమానులలో ఉత్సాహం రెట్టింపు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భారతీయ అభిమానులు తమ అభిమాన గ్రూట్ కోసం ఎదురుచూస్తున్నారు.

అందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. గ్రూట్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానుల హృదయాల్లో తన ముద్ర వేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తి. గ్రూట్ నుంచి స్ఫూర్తి పొందిన సల్మాన్.. ఇప్పుడీ సినిమా ప్రమోషన్స్‌లో భాగమయ్యారు. గ్రూట్ వీడియోని చూసి.. సేమ్ అదే ఫాలో అయ్యే క్రమంలో ఉన్న సల్మాన్ వీడియోని మార్వెల్ సంస్థ విడుదల చేసింది.

ఈ వీడియోలో (Salman Khan) సల్మాన్ తన రోజువారీ సినిమా ప్రమోషన్‌లలో లానే హాస్యభరితమైన టేక్‌‌తో గ్రూట్ స్టైల్‌లో ఉన్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా.. మే 5న మార్వెల్ స్టూడియోస్ వారి ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా అన్ని భాషలలో ఈ చిత్ర ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus