Jr NTR, Hrithik Roshan: వార్2 మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా.. హృతిక్, తారక్ కాంబోలో సాంగ్ అంటూ?

Advertisement

ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమాకు మ్యూజిక్, బీజీఎం కూడా ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే. తెలుగులో కొన్ని సినిమాలను ప్రేక్షకులు అద్భుతమైన బీజీఎం ఉండటం వల్లే మళ్లీమళ్లీ చూశారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  తన సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. దేవర (Devara)  సినిమాకు అనిరుధ్ ను (Anirudh Ravichander) మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసిన తారక్ వార్2 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా వార్2 సినిమాకు ప్రీతమ్ చక్రవర్తి (Pritam) మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ప్రీతమ్ పెద్దగా పరిచయమైన వ్యక్తి కాదు కానీ హిందీలో మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు అదిరిపోయే ట్రాక్ రికార్డ్ ఉంది. తన సినిమాలలో ప్రతి పాట స్పెషల్ గా ఉండేలా ప్రీతమ్ జాగ్రత్తలు తీసుకుంటారు.

ధూమ్2, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లకు ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. వార్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ప్రీతమ్ తెలుగులో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమాలో హృతిక్, తారక్ కాంబోలో ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ నాటు నాటు సాంగ్ ను మించేలా ఉండబోతుందని సమాచారం అందుతోంది.

హృతిక్, తారక్ కాంబోలో సాంగ్ అంటే ఆ సాంగ్ లో డ్యాన్స్ స్టెప్స్ సైతం స్పెషల్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. వార్2 షూట్ త్వరలో మొదలుకానుండగా 2025 సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పది నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా తారక్ కెరీర్ ప్లానింగ్ ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 2025లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus