ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

  • March 22, 2024 / 07:57 PM IST

బిగ్ బాస్ కంటెస్టెంట్ లకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్ళకి సినిమాల్లో ఛాన్సులు వచ్చినా రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంటారు. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంటెస్టెంట్ హాట్ టాపిక్ అయ్యింది. అలా అని ఆమె ఫోటోలతోనో.. అప్డేట్లతోనో కాదు. అరెస్టు అయ్యి. అవును వివాదం కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..కన్నడ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సోను శ్రీనివాస గౌడని తాజాగా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

దీనికి కారణం ఆమె 8 ఏళ్ళ బాలికను ఆమె అక్రమంగా దత్తత తీసుకోవడమే అని సమాచారం. అందువల్ల బైదరహళ్లి పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఆమె ఒక బాలికను దత్తత తీసుకున్నానంటూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా పోస్ట్ ప్రకటించింది. అయితే తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెపై ఒక కంప్లయింట్ ఫైల్ చేశారు.

సానుభూతి, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఆమె .. ఇల్లీగల్ గా ఒక పాపని అడాప్ట్ చేసుకుంది అంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోను శ్రీనివాస గౌడ పలు సినిమాల్లో కూడా నటించింది. కానీ అనుకున్న స్థాయిలో బ్రేక్ రాలేదు. తెలుగులో కూడా ఈమె అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో ఇలా జరిగింది

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus