Lineman Review in Telugu: లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 22, 2024 / 03:21 PM IST

Cast & Crew

  • త్రిగుణ్ (Hero)
  • కాజల్ కుందర్, (Heroine)
  • బి.జయశ్రీ, హరిణి శ్రీకాంత్ తదితరులు. Director : రఘు శాస్త్రి (Cast)
  • రఘు శాస్త్రి (Director)
  • గణేష్ పాపన్న (Producer)
  • మణికాంత్ కాత్రి (Music)
  • శాంతి సాగర్ హెచ్.జి (Cinematography)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డజను చిన్న సినిమాల్లో ‘లైన్ మ్యాన్’ కూడా ఒకటి. ఆదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ ఈ చిత్రంలో హీరో.పల్లెటూర్లలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా లైన్ కట్ అయినా.. ఎక్కువగా తలుచుకునేది ‘లైన్ మ్యాన్’ నే..! అయితే ఈ ‘లైన్ మ్యాన్’ సంగతి వేరు. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేసే ఓ వ్యక్తి హఠాన్మరణం చెందుతాడు. దీంతో ఆ జాబ్ అతని కొడుక్కి వస్తుంది.అతనే నటరాజు అలియాస్ నట్టు(త్రిగుణ్). ఇక ఆ పల్లెటూరిలో కరెంట్ ఎక్కడ పోయినా.. లేకపోతే ఎక్కడికి కనెక్షన్ కావాలన్నా అందరూ ఇతన్నే తలుచుకుంటూ ఉంటారు. ఇక అదే ఊరిలో ఎంతోమంది గర్భిణీ స్త్రీలకి పురుడు పోస్టు ఉంటుంది దేవుడమ్మ(బి.జయశ్రీ). ఆమెను గ్రామస్తులంతా దేవతగా భావిస్తూ ఉంటారు.

ఆమె వయసు 99 ఏళ్లు.. 100 ఏళ్ళకి దగ్గరపడుతుండటంతో.. ఆమె 100వ పుట్టినరోజును ఘనంగా జరపాలని నట్టు అలాగే ఆ ఊరి ప్రజలు భావిస్తారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ సరిగ్గా అదే టైంకి నట్టు.. ఆ వేడుకకు కరెంట్ సప్లై చేయను అంటూ అడ్డం తిరుగుతాడు. అతను ఎందుకు అలా అడ్డం తిరిగాడు? దేవుడమ్మపై అతనికి గల కోపం ఏంటి? మధ్యలో అతని ప్రేమకథ ఏమైంది? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: త్రిగుణ్.. చాలా మంచి నటుడు. అతని పాత్రల ఎంపిక.. కథల ఎంపిక ఇంప్రెసివ్ గానే ఉంటుంది.కానీ ఎందుకో అతనికి సరైన బ్రేక్ రావడం లేదు. ఈ ‘లైన్ మ్యాన్’ లో కూడా అతని నటన డీసెంట్ గానే ఉంటుంది. ఈ పాత్రకి కూడా ఇతనే సెట్ అయ్యాడు అనే ఫీలింగ్ సినిమా చూసిన వారికి కలుగుతుంది. కాజల్ కుందర్ లుక్స్ బాగానే ఉన్నాయి. కానీ నటించే స్కోప్ పెద్దగా ఆమెకు దక్కలేదు. ఎక్కువశాతం సీనియర్ నటి జయశ్రీ కనిపిస్తుంది. ఆ పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది అని చెప్పవచ్చు.

ఇక హరిణి శ్రీకాంత్ ఓకే అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ పాసబుల్ గా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ డల్ అయ్యింది. సెకండాఫ్ ని కనుక దర్శకుడు బాగా హ్యాండిల్ చేసి ఉండుంటే.. కచ్చితంగా రెస్పాన్స్ వేరేగా ఉండేదేమో.

సాంకేతిక నిపుణుల పనితీరు: కథ కానీ, దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కానీ బాగానే ఉంది. లైన్ మ్యాన్ లేకపోతే ఇల్లు చీకటిమయం అవుతుంది అనేది ఎక్కువగా అందరూ గుర్తుచేసుకోరు. ఈ సినిమా ద్వారా వాళ్ళ కష్టాన్ని కూడా జనాలకి తెలియజెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ ఒకే పాయింట్ పై 2 గంటల సేపు ఇంట్రెస్టింగ్ గా కథని నడిపించడంలో అతను విఫలమయ్యాడు. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ను టచ్ చేసి కమర్షియల్ హంగులు దిద్దే అవకాశం ఉన్నా.. ఎందుకో అతను వాటి జోలికి పోలేదు.

ఓ అరగంట షార్ట్ ఫిలింగా దీనిని తీసి ఉంటే అందరికీ రీచ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ అన్నీ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నాయి. నిర్మాతలు కథకు తగ్గట్టు బాగానే ఖర్చు చేసినట్లు ఉన్నారు. కొన్ని విజువల్స్ బాగానే ఉన్నాయి.

విశ్లేషణ: పైన చెప్పుకున్నట్లు సెకండ్ హాఫ్ ను కనుక బాగా డిజైన్ చేసి ఉండుంటే ‘లైన్ మ్యాన్’ స్థాయి వేరేలా ఉండేది. ఇప్పుడైతే ఓ సదా సీదా సినిమాలా మిగిలిపోతుంది.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus