RRR Movie: ఆర్ఆర్ఆర్ లో భయంకరమైన వైల్డ్ ఎనిమాల్స్.. ఎన్ని ఉన్నాయంటే?

  • March 19, 2022 / 03:26 PM IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కనిపించబోతున్నారు. దర్శకుడు రాజమౌళి ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా కూడా అతడిని సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడు.

Click Here To Watch NEW Trailer

ఇక రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తో వస్తున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కూడా అంతకు మించి చూపిస్తాడు అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలు కూడా సినిమాలో ఫిక్షన్ కథలు చాలా కొత్తగా కనిపిస్తాయి అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్గా ఇస్తున్న ఇంటర్వ్యూలలో కూడా ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు.

టైగర్ ఉంటుంది అని ముందుగా ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది అంతేకాకుండా తోడేలు, అనకొండ కూడా ఉంటుంది అని ఇటీవల ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఇక ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే బ్రిడ్జి సీన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఆ సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా జాతీయ జెండా తో చేసే పోరాట సన్నివేశాలు సరికొత్త అనుభూతిని ఇస్తాయి అని తెలుస్తోంది.

అయితే నీళ్లల్లో పడిన అప్పుడు వాళ్ళు ఒక భయంకరమైన మొసలి తో కూడా పోరాటం చేస్తారట. గతంలో దర్శకుడు రాజమౌళి ప్రభాస్ తో చత్రపతి సినిమాలో ఒక భారీ చేపతో యాక్షన్ సీన్స్ హైలెట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ తో మొసలి సీన్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus