Jr NTR Family: భార్య, పిల్లలతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఏ దేశానికి వెళ్లాడంటే..?

  • December 10, 2022 / 12:46 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏదైనా ఓ చిన్న న్యూస్, పిక్ లేదా అప్‌డేట్ వచ్చిందంటే చాలు.. ఇక ఫ్యాన్స్ దాన్ని మీడియాలో వార్త అయ్యేవరకు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ టాప్ ట్రెండింగ్‌లో ఉంచుతారు.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో తారక్‌కి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది.. అతని నటనను ప్రశంసిస్తూ నేషనల్ లెవల్లో అమిత్ షా వంటి వారు సత్కరిస్తే.. ఇంటర్నేషనల్ స్థాయిలో పలు ప్రముఖ పత్రికలు, మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాశాయి..

ముఖ్యంగా ‘కొమురం భీముడో’ పాటలో తను పలికిన హావభావాలకి అందరూ ముగ్దులైపోయారు.. ఇక ట్రిపులార్ జపాన్ రిలీజ్ ప్రమోషన్లలో జపనీస్ భాషలో మాట్లాడి షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్థంతి సందర్భంగా కర్ణాటక రత్న పురస్కార ప్రధాన కార్యక్రమానికి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో పాటు వేదిక పంచుకుని.. కన్నడలో మాట్లాడిన సంగతి తెలిసిందే.. ఈమధ్య మరో కొత్త యాడ్‌‌తో సందడి చేస్తున్నాడు.. రీసెంట్‌గా ఫ్యామిలీతో కలిసి కనిపించాడు..

జూనియర్ ఎన్టీఆర్, భార్య, పిల్లలతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు.. దాదాపు ఒక నెల లాంగ్ అండ్ పర్సనల్ టూర్ ఇది.. ఎయిర్ పోర్టులో తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో తారక్ నడుచుకుంటూ వెళ్తున్న పిక్ సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్, యాడ్ షూటింగ్.. ఇలా బిజీ బిజీగా గడపడంతో కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి యూఎస్ఎ బయలు దేరాడు..

రీసెంట్‌గా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ గ్లింప్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చి.. మరోసారి తన మాడ్యులేషన్‌తో మెస్మరైజ్ చేశాడు.. కొరటాల శివతో చేయబోయే కొత్త సినిమా (NTR 30) ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది.. నటీనటులు, సాంకేతిక నిపుణులను దాదాపుగా ఫైనల్ చేసేశారని సమాచారం.. తారక్ హాలీడే నుండి తిరిగొచ్చాక షూటింగ్ మొదలు పెడతారని.. ఆ లోగానే టీమ్ ఓ అప్‌డేట్ ఇవ్వనుందని అంటున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus