ఎన్టీఆర్ బావమరిదికి ఇది మంచి అవకాశమే..!

  • March 15, 2021 / 04:44 PM IST

సెన్సేషనల్ డైరెక్టర్ తేజ.. ‘చిత్రం’ కు సీక్వెల్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా 2000వ సంవత్సరంలో విడుదలైన ఆ మూవీ భారీ వసూళ్లను రాబట్టి.. అప్పటి స్టార్ డైరెక్టర్లకు సైతం షాకిచ్చింది. ఇక దాని సీక్వెల్ ను ‘చిత్రం 1.1’ టైటిల్ తో తెరకెక్కించబోతున్నాడు తేజ.దీని పై కూడా మంచి హైప్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇతని పేరు నితిన్ అని తెలుస్తుంది.

ఆల్రెడీ నితిన్ అనే పేరుతో ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరో ఉన్నాడు కాబట్టి..ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ చంద్రను ఏ పేరుతో లాంచ్ చేస్తారు అనే విషయం పై ఇప్పుడు ఆసక్తి పెరిగింది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి నితిన్ స్వయానా తమ్ముడు కావడం విశేషం. హీరో అవ్వడం కోసం అతను ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్నాడని సమాచారం. అంతేకాదు డ్యాన్స్, ఫైట్స్ లలో కూడా శిక్షణ తీసుకున్నాడట.ఇతని డెబ్యూ మూవీకి దర్శకుడు తేజ మంచి సెలక్షన్ అనే చెప్పాలి.ప్రతీ ఆర్టిస్ట్ నుండీ మంచి నటన రాబట్టుకోగల సామర్ధ్యం తేజలో ఉంది.

అయితే అతను ఇప్పుడు కమర్షియల్ సక్సెస్ ను అందించేంత ఫామ్లో లేకపోవడం కలవరపెట్టే అంశం.ఈ నేపథ్యంలో నార్నె శ్రీనివాసరావు కొడుకైన నితిన్ నటుడిగా ఏ రేంజ్లో నిలదొక్కుకోగలడు? ఇతనికి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఎంతవరకూ ఉంటుంది? అనే డిస్కషన్లు ఇప్పుడు సర్వత్రా మొదలయ్యాయి. ఇక నార్నె నితిన్ తో పాటు మరో 40 మంది కొత్త ఆర్టిస్టుల్ని కూడా పరిచయం చేయబోతున్నాడట తేజ.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus