Jr NTR, Kalyan Ram: బింబిసారతో కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ ఆగష్టు నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచగా కళ్యాణ్ రామ్ కెరీర్ లో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బింబిసార సినిమాను చూసి కళ్యాణ్ రామ్ తో అభిప్రాయాన్ని పంచుకున్నారని తెలుస్తోంది.

చిత్రయూనిట్ పై తారక్ ప్రశంసలు కురిపించారని కళ్యాణ్ రామ్ నటనను తారక్ తెగ మెచ్చుకున్నారని సమాచారం అందుతోంది. విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమా తెరకెక్కిందని సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉందని తారక్ అన్నారని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని తారక్ నమ్మకాన్ని వ్యక్తం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తోంది. బింబిసార మూవీ 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరిగింది. కేథరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో కళ్యాణ్ రామ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus