ఆర్ఆర్ఆర్ కు చరణ్, తారక్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

  • March 27, 2021 / 08:02 PM IST

చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే రామ్ చరణ్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. నేడు రామ్ చరణ్ 36వ పుట్టినరోజు. చరణ్ బర్త్ డే సందర్భంగా నిన్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి చరణ్ రామరాజు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ కాగా నేడు ఆచార్య సినిమా నుంచి సిద్ధా లుక్ రిలీజ్ అయింది. చరణ్ శంకర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోయినా ఈ సినిమాలో చరణ్ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది.

రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్ గురించి జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు రామ్ చరణ్ ధైర్యవంతుడని, నిజాయితీపరుడని, నీతిమంతుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన లుక్ ను షేర్ చేశారు. ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ మంచి నటుడని..

కష్ట సుఖాలను పంచుకునే మిత్రుడని.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందే చరణ్ తో స్నేహం ఉన్నా ఈ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడిందని చెప్పుకొచ్చారు. చరణ్ తో స్నేహం జీవితాంతం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయని వార్తలు వస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం వేర్వేరుగా 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus