Jr NTR: వార్2 మూవీ షూటింగ్ లోకి యంగ్ టైగర్ ఎంట్రీ అప్పుడేనా?

  • October 19, 2023 / 02:42 PM IST

హృతిక్ రోషన్ అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించనున్నారని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ నెల నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. తారక్ సైతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.

తారక్ రోల్ ఈ సినిమాలో స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. వార్2 సినిమా 2025 సంవత్సరంలో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యశ్ రామ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తారక్ మరిన్ని సినిమాలలో నటించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. వార్2 సినిమాకు తారక్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ లుక్ కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది.

తారక్ ను (Jr NTR) అభిమానించే అభిమానులు తారక్ సినిమాల ప్లానింగ్ విషయంలో సంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది తారక్ నటించే సినిమాలేవీ రిలీజ్ కావడం లేదనే సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం తారక్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి కూడా వచ్చే ఏడాది మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకుంటున్న తారక్ స్క్రిప్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇతర భాషల్లో సైతం తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus