NTR, Prashanth Neel: ప్రశాంత్ నీల్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే!

  • December 14, 2022 / 07:44 PM IST

స్టార్ హీరోను అభిమానించే ఫ్యాన్ దర్శకుడిగా మారి తమ ఫేవరెట్ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు. దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. పవన్ కు హరీశ్ శంకర్ వీరాభిమాని అయిన విధంగానే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ వీరాభిమాని కావడం గమనార్హం.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ కు చాలా సమయం ఉన్నా తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తారక్ ను కూడా డీ గ్లామర్ లుక్ లో చూపించనున్నప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ మూవీ రిలీజ్ కు ముందే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

అయితే తారక్ కు జోడీగా క్రేజ్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న శృతి హాసన్ విషయంలో ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో లేరు. తారక్ కు మాత్రం పాపులారిటీ ఉన్న నటిని ఎంపిక చేయాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను పరిగణనలోకి తీసుకుని ప్రశాంత్ నీల్ తారక్31 హీరోయిన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను తారక్ కు జోడీగా ఎంపిక చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ప్రశాంత్ నీల్ మనస్సులో ఏ హీరోయిన్ ఉన్నారో తెలియాల్సి ఉంది. 2023 సంవత్సరం ఆగష్టు నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus