Jr NTR: మ్యాడ్ సినిమాకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం ఖాయమా?

  • October 4, 2023 / 05:04 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన మ్యాడ్ ట్రైలర్ కు ఏకంగా 5.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మ్యాడ్ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తమ వంతు సపోర్ట్ చేస్తున్నారు. నార్నే నితిన్ ఈ సినిమాతో సక్సెస్ సాధించడంతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మ్యాడ్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా నార్నే నితిన్ కు కూడా భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది. మ్యాడ్ సినిమా కోసం నిర్మాత నాగవంశీ భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం. సితార బ్యానర్ లో వచ్చిన డీజె టిల్లు మూవీ సక్సెస్ సాధించగా ఈ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమా సితార బ్యానర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. బుక్ మై షో యాప్ లో ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. మ్యాడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ బుకింగ్స్ తో వార్తల్లో నిలిచింది.

రూల్స్ రంజాన్, మామా మశ్చీంద్ర సినిమాలు సైతం అదే తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus