Jr NTR: తారక్ ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే మాత్రం బాలీవుడ్ ను రూల్ చేస్తాడా?

Advertisement

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తరువాత ఎన్టీఆర్ (Jr NTR) పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం ఈయన దేవర (Devara) అనే సినిమాల్లో నటిస్తున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబై లోనే ఉంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. అయితే ఈయన ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఫోకస్ చేశారని తెలుస్తుంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ లోనే తారక్ సోలోగా ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేయనున్నాడంటూ ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన వెలబడులేదు కానీ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఏజెన్సీని తన ప్రచారం కోసం ప్రత్యేకంగా నియమించుకున్నారంట.

తనకి సంబందించిన కమర్షియల్ యాడ్స్, బాలీవుడ్ సినిమా ఆఫర్స్ బాధ్యతలు అన్ని కూడా ఆ ఏజెన్సీ ఇకపై చూసుకోబోతోందని టాక్. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాటడం కోసమే ఇలా బాలీవుడ్ వైపు ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నటువంటి. హీరోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ చూపు బాలీవుడ్ పై పడిందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus