Devara 2: ‘దేవర 2’ కి మోక్షం కలిగించబోతున్న ఎన్టీఆర్..!

Advertisement

ఎన్టీఆర్  (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’  (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ‘దేవర'(మొదటి భాగం) (Devara) కూడా వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది దసరాకి కొద్దిరోజుల ముందు రిలీజ్ అయిన ఈ సినిమా.. కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లే సాధించింది. కమర్షియల్ గా ఈ సినిమా హిట్. సోలో హీరోగా ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా కూడా ఇదే.

Devara 2

ఇక ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ముందుగానే ప్రకటించాడు. సాధారణంగా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే.. సీక్వెల్ ఆలోచనని దర్శకనిర్మాతలు పక్కన పెట్టేస్తారు. కానీ ‘దేవర’ కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకుంది. క్లైమాక్స్ ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. మొదటి భాగంలో వదిలేసిన ప్రశ్నల గురించి కొంచెం ఎక్కువగానే చర్చించుకుంటున్నారు. కాబట్టి ‘దేవర 2’ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

త్వరలోనే ‘దేవర 2’ సెట్స్ పైకి వెళ్లనుంది. ‘వార్ 2’ కంప్లీట్ అయిన వెంటనే ‘దేవర 2’ కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వబోతున్నాడట. ఇన్సైడ్ టాక్ ప్రకారం ‘దేవర 2’ కోసం ఎన్టీఆర్ 32 రోజులు కాల్షీట్స్ ఇస్తున్నాడట. ఎన్టీఆర్ ఎపిసోడ్ తొందరగానే పూర్తవుతుంది అని తెలుస్తుంది. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాకి డేట్స్ ఇస్తాడు. దాని మేకోవర్ కోసం కొంచెం ఎక్కువ టైం పడుతుందట. అందుకే ‘దేవర 2’ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అట్లీ కొత్త సినిమా.. ఈసారి రూమర్‌ బలంగా వినిపిస్తోందిగా.. కుదిరితే డబుల్‌ బ్లాక్‌బస్టర్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus