‘జవాన్’ (Jawan) సినిమా తర్వాత అట్లీ(Atlee Kumar) ఏ సినిమా చేస్తారు అంటూ గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. కెరీర్ కష్టాల్లో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు (Shah Rukh Khan) కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు ఆయన. ఆ సినిమా తర్వాత తెలుగు స్టార్ హీరోతో సినిమా కాదు కాదు తమిళంలో సినిమాలు చేస్తారు అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. కానీ ఆయన ఇప్పట్లో తిరిగి సౌత్‌కి వచ్చేలా కనిపించడం లేదు అనే వార్తలొచ్చాయి.
దీంతో అట్లీ మనకు దూరమయ్యాడా.. బాలీవుడ్‌కి బాగా దగ్గరయ్యాడా అనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అట్లీ టీమ్ నుండి ఓ వార్త బయటకు వచ్చింది. అదే తన నెక్స్ట్ సినిమా అసలు సిసలు పాన్ ఇండియా సినిమా అని. ఏదో ప్యాడింగ్ కోసం రెండు పరిశ్రమల్లో నటుల్ని తీసుకోవడం కాకుండా.. రెండు వుడ్‌ల నుండి సూపర్ స్టార్లను కలిపి సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు.
అట్లీ కొత్త సినిమా సల్మాన్ ఖాన్‌తో ఉంటుందని, పరిశ్రమలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని కాంబోలో, కథతో ఆ సినిమా తెరకెక్కుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ కాంబోనే రజనీకాంత్ (Rajinikanth) – సల్మాన్ ఖాన్ (Salman Khan) అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరికీ ఈ కథను చెప్పి అట్లీ ఓకే చేయించుకున్నారు అని సమాచారం. రజనీ, సల్మాన్ లాంటి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడం అంత ఈజీ కాదు. ఏ ఒక్కరికి ఇంపార్టెంట్స్ తగ్గినా ప్రేక్షకులు భరించలేరు.
కాబట్టి కత్తి మీద సాములాంటి ఈ కాంబినేషన్‌ని, సినిమాను అట్లీ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. అన్నింటికి మించి ఈ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అట్లీ సినిమా వచ్చి ఏడాదిన్నర అయిపోయింది. ఆయన లాంటి మాస్ డైరక్టర్ ఇంత గ్యాప్ తీసుకోవడం పరిశ్రమకు మంచిది కాదు. హిట్ కొడితే కోట్లకు కోట్లు వసూళ్లు తెప్పించే మేకర్ ఆయన.